లోకేష్ అరెస్ట్: తోట్లవల్లూరులో వైసీపీ ఎమ్మెల్యే ఘోరావ్, ఉద్రిక్తత

Published : Jan 07, 2020, 06:09 PM IST
లోకేష్ అరెస్ట్: తోట్లవల్లూరులో వైసీపీ ఎమ్మెల్యే  ఘోరావ్, ఉద్రిక్తత

సారాంశం

తోట్లవల్లూరులో మంగళవారం నాడు ఉద్రిక్తత చోటు చేసుకొంది.లోకేష్ అరెస్ట్ తో టీడీపీ కార్యకర్తలు, నేతలు ఆందోళనకు దిగారు. ఈ సమయంలో పోలీసులు ఎమ్మెల్యేను జాగ్రత్తగా పంపారు.

గుంటూరు: రాజదానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ తోట్లవల్లూరు కరకట్ట వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.  లోకేష్  అరెస్ట్‌ను నిరసిస్తూ రహదారిపై టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. ఆ సమయంలో అటుగా వచ్చిన వైసీపీ ఎమ్మెల్యేను టీడీపీ కార్యకర్తలు చుట్టుముట్టారు. ఎమ్మెల్యేను ఘోరావ్ చేశారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది.

అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని తాను తిరిగి వస్తుండగా  తోట్లవల్లూరు కరకట్ట వద్దకు చేరుకొన్నారు. ఆ సమయంలో లోకేష్ అరెస్ట్ కు నిరసనగా టీడీపీ కార్యకర్తలు టైర్లు కాల్చి నిరసనలకు దిగారు. అదే సమయంలో నిరసనలకు దిగిన టీడీపీ కార్యకర్తలు వైసీపీ ఎమ్మెల్యేను చూసి ఘోరావ్ చేశారు.

ఈ సమయంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు తనపై దాడికి పాల్పడేందుకు ప్రయత్నించారని ఎమ్మెల్యే అనిల్  విమర్శించారు.  ఆ తర్వాత పోలీసులు అతి కష్టం మీద  ఎమ్మెల్యే అనిల్‌ను అక్కడ నుండి పంపించారు. తనతో పాటు గన్‌మెన్‌తో పాటు  ఇద్దరు మాత్రమే ఉన్నారని ఎమ్మెల్యే అనిల్ చెప్పారు.  
 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్