జనవరి 13న రెండు రాష్ట్రాల సీఎంల సమావేశం

Published : Jan 07, 2020, 03:47 PM ISTUpdated : Jan 13, 2020, 07:42 AM IST
జనవరి 13న రెండు రాష్ట్రాల సీఎంల సమావేశం

సారాంశం

తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు సీఎంలు ఈ నెల 13వ తేదీన హైద్రాబాద్ లో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలపై చర్చించనున్నారు. 

 
హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు  ఈ నెల 13 తేదీన సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో  రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలపై చర్చించనున్నారు.

రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలపై చర్చించేందుకు ఇద్దరు సీఎంలు ఇప్పటికే మూడు దఫాలు సమావేశమయ్యారు. ఈ సమావేశాల్లో రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలపై చర్చించారు.

ఈ చర్చలకు కొనసాగింపుగానే మరోసారి రెండు రాష్ట్రాల సీఎంలు మరోసారి సమావేశం కానున్నారు. గత ఏడాది నవంబర్ 23వ తేదీన ఇద్దరు సీఎంలు భేటీ అయ్యారు.

ఈ భేటీలో ప్రధానంగా కృష్ణా, గోదావరి నదుల అనుసంధానంపై చర్చించారు. ఈ రెండు నదులను అనుసంధానం చేయడం ద్వారా రెండు రాష్ట్రాలకు నీటిని వినియోగించుకోవాలని భావించారు.

ఇటీవలనే విద్యుత్ ఉద్యోగుల విభజన విషయమై జరిగింది . రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్‌లో సమస్యలు ఇంకా చాలా ఉన్నాయి. సచివాలయ భవనాలు తెలంగాణ కు అప్పగించింది ఏపీ సర్కార్.

PREV
click me!

Recommended Stories

పిల్ల‌లు కాదు పిశాచాలు.. టీచ‌ర్‌పై దాడి చేసి ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థి. వీడియో చూస్తే ఒళ్లు మండాల్సిందే.
Chintha Vijay Prathap Reddy: జగ్గయ్యపేట అంగన్వాడీ కేంద్రాలపై ఫుడ్ కమిషన్ తనిఖీ| Asianet News Telugu