మంత్రి పేర్ని నాని కాన్వాయ్ ని అడ్డగించిన జనసేన : తణుకులో ఉద్రిక్తత, క్షమాపణకు డిమాండ్

By narsimha lodeFirst Published Sep 30, 2021, 1:28 PM IST
Highlights

తణుకులో మంత్రి పేర్ని నాని కాన్వాయ్ ను జనసేన  కార్యకర్తలు అడ్డుకొన్నారు. మంత్రి పేర్ని నాని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇవాళ తణుకు టూర్ కు వచ్చిన మంత్రి పేర్నినాని కాన్వాయ్ ను జనసేన కార్యకర్తలు అడ్డుకోబోయారు. పోలీసులు జనసేన కార్యకర్తలను అదుపులోకి తీసుకొన్నారు.

ఏలూరు: పశ్చిమ గోదావరి (west godavari district)జిల్లా తణుకులో(tanuku)  ఏపీ రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని (perni nani) కాన్వాయ్( minister convoyను జనసేన (jana sena)
 కార్యకర్తలు అడ్డుకోబోయారు. పోలీసులు జనసేన కార్యకర్తలు అరెస్ట్ చేశారు. 

పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పర్యటనకు గురువారం నాడు ఏపీ  మంత్రి పేర్ని నాని వచ్చారు. తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు ఇంటికి సమీపంలో జనసేన కార్యకర్తలు మంత్రి పేర్ని నాని కాన్వాయ్ ను అడ్డుకొనే ప్రయత్నం చేశారు. మంత్రి కాన్వాయ్ కు జనసేన కార్యకర్తలు అడ్డుకొనే ప్రయత్నం చేశారు.

పోలీసులు జనసేన కార్యకర్తలను అడ్డుకొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నానికి వ్యతిరేకంగా జనసేన కార్యకర్తలు నినాదాలు చేశారు. మరో వైపు పవన్ కళ్యాణ్ పై (pawan kalyan)తీవ్ర విమర్శలు గుప్పించిన మంత్రి పేర్నినాని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు జనసేన కార్యకర్తలు.

జనసేన చీప్ పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలకు మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ తోపాటు జనసేన చేసిన విమర్శలపై మంత్రులు పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్ తో పాటు సినీ నటుటు పోసాని కృష్ణ మురళిలు స్పందించారు.  వైసీపీ, జనసేనల మధ్య మాటల యుద్ధం సాగుతోంది.
 

click me!