దాచేపల్లిలో దారుణం... మంటల్లో చిక్కుకుని వ్యక్తి సజీవదహనం

Arun Kumar P   | Asianet News
Published : Sep 30, 2021, 12:22 PM IST
దాచేపల్లిలో దారుణం... మంటల్లో చిక్కుకుని వ్యక్తి సజీవదహనం

సారాంశం

షాట్ సర్క్యూట్ కారణంగా ఇంట్లో మంటలు చెలరేగి ఓ వ్యక్తి సజీవదహనం అయిన సంఘటన గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం తక్కెళ్లపాడు గ్రామంలో చోటుచేసుకుంది. 

దాచేపల్లి (Dachepalli): మంటల్లో చిక్కుకని ఓ వ్యక్తి సజీవదహనమైన విషాద ఘటన గుంటూరు జిల్లాలో (Guntur District) చోటుచేసుకుంది. ఇంట్లో వుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో తప్పించుకోవడం సాధ్యంకాక సజీవదహనం అయ్యాడు. 

వివరాల్లోకి వెళితే... గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం తక్కెళ్లపాడు గ్రామంలో జక్క లక్ష్మీనారాయణ(45) కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు. అయితే అతడు ఇంట్లో ఒంటరిగా వుండగా షాట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు ఇళ్లంతా వ్యాపించడంతో లక్ష్మినారాయణ ఆ మంటల్లో చిక్కుకున్నాడు. తప్పించుకోడానికి ప్రయత్నించినా సాధ్యపడక అతడు మంటల్లో దహనమై మృతి చెందాడు. 

read more  యూ ట్యూబ్ లో చూసి.. చాకుతో గొంతు కోసుకుని బాలిక ఆత్మహత్య... !

మంటలు ఎగిసిపడడంతో ఆ ఇల్లు మొత్తం కాలిబూడిదయ్యింది. స్థానికులు అందించిన సమాచారంతో ఘటనా స్థలాన్ని పరిశీలించారు పోలీసులు. ఈ అగ్నిప్రమాదానికి షాట్ సర్క్యూట్ కారణమని ప్రాథమికంగా నిర్దారించారు. దర్యాప్తు చేసి అగ్నిప్రమాదం గురించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. లక్ష్మీనారాయణ మృతితో ఆ కుటుంబంలోనే కాదు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.   
 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?