కాటన్ బ్యారేజీపై శ్రమదానం...జనసేనకు అనుమతి లేదు: తేల్చేసిన ఇరిగేషన్ ఎస్ఈ

By narsimha lode  |  First Published Sep 30, 2021, 1:10 PM IST

కాటన్ బ్యారేజీపై జసేన శ్రమదానం కార్యక్రమానికి అనుమతి లేదని ఇరిగేషన్ శాఖ ఎస్ఈ తేల్చి చెప్పారు. అక్టోబర్ 2వ తేదీన కాటన్ బ్యారేజీపై శ్రమదానం చేయాలని పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకొన్నారు. అయితే  ఈ బ్యారేజీపై టెక్నాలజీ సహాయం లేకుండా గుంతలను పూడిస్తే బ్యారేజీకి నష్టమని  ఎస్ఈ తెలిపారు.
 


అమరావతి: కాటన్ బ్యారేజీపై (cotton barrage )జనసేన (jana sena) శ్రమదానం కార్యక్రమానికి పర్మిషన్ (permission)లేదని ఇరిగేషన్ ఎస్‌ఈ (irrigation) స్పష్టం చేశారు. కాటన్ బ్యారేజీ రోడ్లు భవనాల శాఖ పరిధిలోకి రాదని స్పష్టం చేశారు ఎస్ఈ. మానవతా దృక్పథంతో ప్రజల రాకపోకలకు అనుమతి ఇస్తున్నామని ఆయన తెలిపారు.

సరైన సాంకేతిక పరిజ్ఞానం లేకుండా గుంతలను పూడ్చితే బ్యారేజీకి నష్టం కలుగుతుందని ఆయన తెలిపారు. కాగా బ్యారేజీపై రోడ్డు బాగు చేసే కార్యక్రమాన్ని జరిపి తీరుతామని  జనసేన శ్రేణులు స్పష్టం చేశారు. తూర్పు గోదావరి, అనంతపురం జిల్లాలలో పవన్  కళ్యాణ్ శ్రమదానం కోసం ముమ్మర ఏర్పాట్లు చేపట్టారు.

Latest Videos

also read:బద్వేల్‌లో పోటీపై పవన్‌తో చర్చిస్తాం: బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు

 అక్టోబర్ 2వ తేదీన రోడ్ల దుస్థితిని నిరసిస్తూ శ్రమదానం  కార్యక్రమాన్ని నిర్వహించాలని జనసేన నిర్ణయం తీసుకొంది.  రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిధులను ఖర్చు చేయడం లేదని బీజేపీ, జనసేనలు విమర్శలు గుప్పిస్తున్నాయి. జనసేన ఆందోళన కార్యక్రమంలో తాము కూడ పాల్గొంటామని బీజేపీ కూడ తెలిపింది.

click me!