రామతీర్థం జంక్షన్ వద్ద ఉద్రిక్తత: సోము వీర్రాజు సహా బీజేపీ నేతల అరెస్ట్

By narsimha lodeFirst Published Jan 5, 2021, 10:17 AM IST
Highlights

విజయనగరం జిల్లాలోని రామతీర్ధం జంక్షన్ వద్ద మంగళవారం నాడు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సహా పలువురు బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.
 


విజయనగరం: విజయనగరం జిల్లాలోని రామతీర్ధం జంక్షన్ వద్ద మంగళవారం నాడు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సహా పలువురు బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.

రామ తీర్థంలో శ్రీరాముడి విగ్రహాన్ని గత ఏడాది డిసెంబర్ చివరి మాసంలో ధ్వంసమైంది. ఈ ఘటనను నిరసిస్తూ ఇవాళ బీజేపీ, జనసేనలు చలో రామతీర్ధం కార్యక్రమానికి పిలుపునిచ్చాయి.

అయితే ఈ రామతీర్థం వెళ్లకుండా బీజేపీ, జనసేన కార్యకర్తలు, నేతలను పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా అడ్డుకొన్నారు.  ఎక్కడికక్కడే  పోలీసులు బీజేపీ, జనసేన నేతలను ముందస్తుగా హౌస్ అరెస్ట్  చేశారు.

నెల్లిమర్ల నుండి రామతీర్థం వెళ్లే రూట్ లో  తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చలో రామతీర్థం కార్యక్రమం నేపథ్యంలో పోలీసులు  పోలీసులు  రోడ్డుపై ఎక్కడికక్కడే బారికేడ్లను ఏర్పాటు చేశారు. బారికేడ్లను తొలగించి రామతీర్థం వైపునకు వెళ్లేందుకు సోము వీర్రాజు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే పోలీసులతో సోము వీర్రాజు సహా బీజేపీ కార్యకర్తలు, నేతలు వాగ్వాదానికి దిగారు.

చంద్రబాబు, విజయసాయిరెడ్డిని రామతీర్థం గుట్టపైకి అనుమతించిన పోలీసులు తమను ఎందుకు అనుమతించడం లేదని ఆయన ప్రశ్నించారు.
 

click me!