దివీస్ వ్యతిరేక పోరాటం: రేపు పవన్ కళ్యాణ్ టూర్

By narsimha lodeFirst Published Jan 4, 2021, 9:32 PM IST
Highlights

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 5వ తేదీన తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు.  తుని నియోజకవర్గంలో ఏర్పాటౌతున్న దివిస్ ఫార్మా సంస్థకు వ్యతిరేకంగా స్థానికులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు.

హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 5వ తేదీన తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు.  తుని నియోజకవర్గంలో ఏర్పాటౌతున్న దివిస్ ఫార్మా సంస్థకు వ్యతిరేకంగా స్థానికులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు.

గత ఏడాది డిసెంబర్ మాసంలో ఈ ఫ్యాక్టరీని  ఏర్పాటును నిరసిస్తూ  స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఫ్యాక్టరీలో తాత్కాలిక నిర్మాణాలను ధ్వంసం చేశారు.

మధ్యాహ్నం ఒంటి గంటకు తుని  నియోజకవర్గానికి ఒంటి గంటకు చేరుకొంటారు. అక్కడి నుండి దివిస్ పరిశ్రమ కాలుష్యంతో ఉపాధి కోల్పోయి తీవ్ర ప్రభావానికి లోనయ్యే దానవాయిపేట, కొత్తపాక పరిసర ప్రాంతాల్లో పర్యటిస్తారు.

దివీస్ వ్యతిరేక ఆందోళనలు చేస్తున్న వారిపై ఇటీవల పోలీసులు లాఠీచార్జీ చేశారు. లాఠీచార్జీలో గాయపడినవారిని పవన్ కళ్యాణ్ పరామర్శించనున్నారు. అనంతరం మధ్యాహ్నం రెండు గంటలకు జరిగే బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు.

ఇటీవలనే కృష్ణా జిల్లాలో జరిగే నివర్ తుఫాన్ తో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ డిమాండ్ తో కృష్ణా జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు.

click me!