అనంతపురంలో ఉద్రిక్తత: తహసీల్దార్ కార్యాలయంలో డెడ్‌బాడీతో ఆందోళన

By narsimha lodeFirst Published Oct 26, 2021, 2:53 PM IST
Highlights

అనంతపురం జిల్లా బత్తలపల్లి ఎమ్మార్వో ఆఫీసులో లక్ష్మీదేవి అనే మహిళ మృతదేహంతో ఆందోళనకు దిగారు. భర్త పేరున ఉన్న భూమిని తన పేరున మార్చాలని లక్ష్మీదేవి కోరినా కూడ పట్టించుకోలేదు. దీంతో మనోవేదనకు గురైన ఆమె మృతి చెందింది.

అనంతపురం:అనంతపురం జిల్లా Bathalapalli mro కార్యాలయంలో వృద్దురాలి డెడ్‌బాడీతో బాధిత కుటుంబసభ్యులు ఆందోళనకు దిగడంతో  తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మృతురాలి కుటుంబసభ్యులకు పోలీసులు నచ్చజెప్పడంతో చివరకు బాధిత కుటుంబసభ్యులు ఆందోళనను విరమించారు.Anantapur జిల్లాలోని  బత్తలపల్లి మండలం Jalalpuram గ్రామానికి చెందిన Laxmi Devi, peddanna భార్యాభర్తలు. అనారోగ్యంతో పెద్దన్న ఏడేళ్ల క్రితం మరణించాడు. పెద్దన్న పేరున ఉన్న భూమిని తన పేరున మార్చాలని పెద్దన్న భార్య లక్ష్మిదేవి తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతుంది. అయినా కూడ ఆమె పేరున భూమి మార్పిడి జరగలేదు.  తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది.

also read:ఎమ్మెల్యే భూమికే నకిలీ పత్రాలు.. రూ. 100 కోట్ల భూ దందా, విశాఖ రూరల్ ఎమ్మార్వోపై వేటు

దీంతో మనోవేదనకు గురైన లక్ష్మిదేవి మరణించిందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. లక్ష్మీదేవి డెడ్‌బాడీని బత్తలపల్లి తహసీల్దార్ కార్యాలయానికి తీసుకొచ్చి ఆందోళన చేశారు. తహసీల్దార్ టేబుల్‌పై లక్ష్మీదేవి డెడ్‌బాడీని ఉంచి నిరసన వ్యక్తం చేశారు.లక్ష్మీదేవి డెడ్ బాడీని కార్యాలయంలోకి తీసుకురాకుండా కొందరు ఉద్యోగులు అడ్డుకొన్నారు. అయితే మృతురాలి కుటుంబసభ్యులు వారిని నెట్టుకుంటూ డెడ్‌బాడీని తహసీల్దార్ కార్యాలయానికి తీసుకెళ్లారు.

ఎమ్మార్వో టేబుల్ పై డెడ్ బాడీ పెట్టి ఆందోళన చేశారు. ఈ విషయం తెలుసుకొన్న పోలీసులు అక్కడికి చేరుకొని బాధిత కుటుంబసభ్యులకు నచ్చజెప్పారు. చివరకు బాధిత కుటుంబసభ్యులు ఆందోళన విరమించి డెడ్‌బాడీని తీసుకెళ్లారు.తండ్రి పేరున భూమి కొడుకుల పేరున, భర్త పేరున ఉన్న భూమి భార్య పేరుపైకి మార్చడానికి తహసీల్దార్ కార్యాలయాల్లో అధికారులు ఇబ్బందులు పెడుతున్న ఘటనలు అనేకం ఉన్నాయి. అధికారుల వేధింపులను నిరసిస్తూ  తహసీల్దార్ కార్యాలయాల్లో బాధిత కుటుంబ సభ్యులు ఆత్మహత్యాయత్నం చేసుకొన్న ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో గతంలో అనేకం చోటు చేసుకొన్నాయి.

click me!