మహిళా కమిషన్ సెమినార్‌ వద్ద టీడీపీ, జనసేన ఆందోళన: విజయవాడలో ఉద్రిక్తత

Published : Jul 05, 2023, 03:21 PM IST
మహిళా కమిషన్ సెమినార్‌ వద్ద టీడీపీ, జనసేన ఆందోళన:  విజయవాడలో ఉద్రిక్తత

సారాంశం

విజయవాడలో మహిళా కమిషన్ నిర్వహిస్తున్న  సెమినార్ హల్ లోకి తమను  అనుమతించాలని  టీడీపీ, జనసేన అనుబంధ విభాగాలు ఆందోళనతో  ఉద్రిక్తత నెలకొంది.

 


విజయవాడ: మహిళలపై దాడులు, సోషల్ మీడియాలో  అనుచిత పోస్టుల విషయమై   విజయవాడలో బుధవారంనాడు మహిళ కమిషన్  సెమినార్ ఏర్పాటు  చేసింది.  అయితే  ఈ సెమినార్ జరిగే  హోటల్ ఐలాపురానికి  తెలుగు మహిళలు, జనసేన వీర మహిళలు  ర్యాలీగా వచ్చారు.  మహిళల సమస్యలపై  తాము  మహిళా కమిషన్ చైర్ పర్సన్ కు  వినతి పత్రం సమర్పిస్తామని చెప్పారు. వినతిపత్రం సమర్పించేందుకు  ఆరుగురు ప్రతినిధులను అనుమతి ఇస్తామని  పోలీసులు చెప్పారు.  ఈ సమయంలో  పోలీసులకు  టీడీపీ, జనసేన మహిళ విభాగం  ప్రతినిధులకు  మధ్య  వాగ్వాదం చోటు  చేసుకుంది. సెమినార్ జరిగే హోటల్ ముందే  ఈ రెండు పార్టీలకు  చెందిన మహిళలు ఆందోళనకు దిగారు. దీంతో  విజయవాడలో  ఉద్రిక్తత నెలకొంది.  

ఏపీ సీఎం వైఎస్ జగన్ సతీమణి  వైఎస్ సునీతపై  సోషల్ మీడియాలో  అనుచిత పోస్టు పెడితే  మహిళా కమిషన్  సెమినార్ నిర్వహించడాన్ని  విపక్ష పార్టీలకు  చెందిన  మహిళా సంఘాల నేతలు తప్పు బడుతున్నారు.  వైఎస్ జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వత సోషల్ మీడియాలో  విపక్ష పార్టీల మహిళా నేతలపై, ఆ కుటుంబాలపై  అనుచిత పోస్టింగులు పెట్టడంపై  మహిళ కమిషన్ ఎందుకు స్పందించలేదని  తెలుగు మహిళ అధ్యక్షురాలు  అనిత ప్రశ్నించారు. 
 

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్