విశాఖపట్టణం జిల్లాలో మత్స్యకారుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకొంది. రింగ్ వలలు, సంప్రదాయ వలలు ఉపయోగించిన మత్స్యకారుల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది. దీంతో చేపల వేటపై నిషేధం చోటు చేసుకొంది.
విశాఖపట్టణం: Visakhapatnam జిల్లాలో Ring Net వివాదంతో మత్స్యకార గ్రామాల్లో ఉద్రిక్తత చోటు చేసుకొంది. ఈ నెల 29వ తేదీన ఈ వివాదంతో పెద్దజాలరిపేట, జాలరి ఎండాడ గ్రామాల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకొంది.
సంప్రదాయ వలలతో చేపల వేట చేసే మత్స్యకారులకు రింగ్ వలలను ఉపయోగించే మత్స్కకారులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. రింగ్ వలలు ఉపయోగించడం వల్ల చిన్న చేప పిల్లలు కూడా వలలకు వస్తాయి. దీంతో భవిష్యత్తులో మత్స్య సంపద కూడా దెబ్బతినే అవకాశం ఉందని సంపద్రాయంగా చేపల వేట నిర్వహించే మత్స్యకారులు చెబుతున్నారు.
undefined
ఇదే విషయమై ఈ రెండు గ్రామాల మత్య్స్యకారుల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది. జాలరి ఎండాడ గ్రామానికి చెందిన మత్స్యకారుల బోట్లను పెద్దజాలరిపేట మత్స్యకారులు దగ్దం చేశారని పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో పెద్దజాలరిపేట గ్రామానికి చెందిన బోట్లను జాలరిఎండాడ గ్రామ మత్స్యకారులు తీసుకువచ్చారు.
also read:విశాఖ జిల్లాలో రింగ్ వలల వివాదం: మత్స్యకార గ్రామాల మధ్య టెన్షన్
దీంతో ఈ రెండు గ్రామాల మధ్య చోటు చేసుకొన్న వివాదాన్ని పరిష్కరించేందుకు మంత్రి అప్పలరాజు కూడా స్వయంగా రంగంలోకి దిగారు.ఈ విషయమై రెండు గ్రామాలకు చెందిన మత్స్యకారులతో మాట్లాడి జెంటిల్ మెన్ ఒప్పందం కుదిర్చారు.
అయినా కూడా ఈ రెండు గ్రామాలకు చెందిన మత్య్సకారులు పరస్పరం కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. మత్స్యకార గ్రామాల మధ్య ఉద్రిక్త చోటు చేసుకోవడంతో తాత్కాలికంగా చేపల వేటను కూడా నిషేధించారు.