ప్రకాశంలో ఆర్మీ జవాన్ సూర్యప్రకాష్ రెడ్డి సూసైడ్: న్యాయం చేయాలని కుటుంబ సభ్యుల ఆందోళన

Published : Aug 24, 2022, 03:50 PM IST
 ప్రకాశంలో ఆర్మీ జవాన్ సూర్యప్రకాష్ రెడ్డి సూసైడ్:  న్యాయం చేయాలని కుటుంబ సభ్యుల ఆందోళన

సారాంశం

ప్రకాశం జిల్లాలోని  ఒంగోలు-చీరాల హైవేపై ఆత్మహత్య చేసుకున్న ఆర్మీ జవాన్ అక్కల సూర్యప్రకాష్ రెడ్డి  మృతదేహంతో ఆందోళనకు దిగారు. దీంతో ట్రాఫిక్ జామ్ అయింది. 

ఒంగోలు: జవాన్ అక్కల సూర్యప్రకాష్ రెడ్డి ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మృతుడి కుటుంబసభ్యులు, బంధువులు ఒంగోలు-చీరాల హైవేపై ఆందోళనకు దిగారు. దీంతో భారీగా ట్రాఫిక్ జాం అయింది.  జవాన్ అక్కల సూర్యప్రకాష్ రెడ్డి ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ లో విధులు నిర్వహించే సూర్యప్రకాష్ రెడ్డిది బాపట్ల జిల్లా చినగంజాం మండలం మూలగానివారిపాలెం గ్రామం. అదే ప్రాంతానికి చెందిన యువతిని సూర్య ప్రకాష్ రెడ్డి ప్రేమిస్తున్నాడు.

అయితే ఈ విషయం అమ్మాయి తల్లిదండ్రులకు తెలిసింది. సూర్య ప్రకాష్ రెడ్డితో ప్రేమ వ్యవహరం నచ్చని యువతి తల్లిదండ్రులు సూర్యప్రకాష్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను సూర్యప్రకాష్ రెడ్డి వేధింపులకు గురి చేస్తున్నారని యువతి పోలీసులకు పిర్యాదు చేసింది.ఈ ఫిర్యాదుతో సూర్య ప్రకాష్ రెడ్డి మనో వేదనకు గురయ్యాడు. జమ్మూ కాశ్మీర్ లో  ఈ నెల 21న  సూర్యప్రకాష్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. సూర్య ప్రకాష్ రెడ్డి మృతదేహం ప్రకాశం జిల్లాలోని స్వగ్రామానికి చేరుకుంది. దీంతో సూర్య ప్రకాష్ రెడ్డి మృతదేహంతో పేరేంట్స్, కుటుంబ సభ్యులు ఒంగోలు-చీరాల హైవేపై ఆందోళనకు దిగారు. సూర్యప్రకాష్ రెడ్డి ఆత్మహత్యకు కారణమైన  వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Heavy Rain Alert : బంగాళాఖాతంలో తుపాను లోడ్ అవుతోందా? ఈ ప్రాంతాల్లో అతిభారీ వర్షాలతో అల్లకల్లోలం తప్పదా?
Vijaysai Reddy Sensational Comments On YS Jagan | Asianet News Telugu