పులివెందులలో విషాదం.. నీటిగుండంలో పడి ముగ్గురు మృతి...

By Bukka SumabalaFirst Published Aug 24, 2022, 2:11 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ లోని పులివెందులలో విషాదం చోటు చేసుకుంది. నీటిగుండంలో పడి ముగ్గురు యువకులు మృతి చెందారు.

కడప : పులివెందులలోని నామాలగుండులో విషాదం చోటుచేసుకుంది. నీటిగుండంలో స్నానానికి దిగిన ముగ్గురు యువకులు మృతి చెందారు.  ఈ ఘటన బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  ఇంటి నుంచి బయటకు వెళ్లిన యువకులు తిరిగి ఇంటికి రాకపోవడంతో యువకుల తల్లిదండ్రులు..  అంతటా వెతికి చివరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో చివరిసారిగా వీళ్ళు నామాలగుండు ప్రాంతానికి చేరుకున్నారని తెలియడంతో  ఘటనా స్థలానికి చేరుకున్నారు.
  
పోలీసులు, ఫైర్ సిబ్బంది తో కలిసి వెతకగా నీటి గుండంలో మృతదేహాలు బయటపడ్డాయి. మృతులు ప్రొద్దుటూరుకు చెందిన బాల శేఖర్, సంజీవ్ కుమార్, గోపాల్ దాస్ గా పోలీసులు గుర్తించారు. చేతికి అంది వచ్చిన కొడుకులు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. 

నాగార్జున సాగర్‌ డ్యామ్ వద్ద తెలుగు రాష్ట్రాల పోలీసుల మధ్య వివాదం.. అసలేం జరిగిందంటే..

ఇదిలా ఉండగా, ఆగస్ట్ 20న  ఓ పరిశ్రమలోని ఆల్కహాల్ సంపులో పడి మూడేళ్ల చిన్నారి మృతి చెందాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జీడిమెట్ల ఎస్సై గౌతమ్ తెలిపిన వివరాల మేరకు.. జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని రాజ్ కమల్ ల్యాబ్ లో బీహార్ కు చెందిన రామ్ కటుంబంతో కలిసి కాపలాదారుగా పనిచేస్తున్నాడు. ఈ నెల 16న అతని కుమారుడు రాజ్ కుమార్ (3) ఆడుకుంటుండగా తల్లిదండ్రులు వారి పనుల్లో నిమగ్నమయ్యారు. కొంత సమయానికి చూస్తే కనిపించలేదు. సంస్థ ఆవరణలోని ఆల్కమాల్ సంపులో చూడగా రాజ్ కుమార్ కనిపించాడు. పైకి తీసి చూడగా అప్పటికే మృతి చెందాడు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 

click me!