పెరిగిపోతున్న ‘నంద్యాల’ టెన్షన్

Published : Aug 27, 2017, 08:40 AM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
పెరిగిపోతున్న ‘నంద్యాల’ టెన్షన్

సారాంశం

నేతల్లో నంద్యాల టెన్షన్ పెరిగిపోతోంది. పోలింగ్ కు ముందేమో ఓట్ల టెన్షన్. పోలింగ్ అయిపోయిన తర్వాత కౌంటింగ్ టెన్షన్. సోమవారం ఉదయం కౌటింగ్ మొదలయ్యే వరకూ ఈ టెన్షన్ తప్పదు. హోరా హోరీగా సాగిన ఎన్నికలో కూడా నంద్యాల పట్టణంలోని 37 వేలమంది ఓటర్లు ఓటింగ్ లో పాల్గొనలేదంటే ఏమని అర్దం?  

నేతల్లో నంద్యాల టెన్షన్ పెరిగిపోతోంది. పోలింగ్ కు ముందేమో ఓట్ల టెన్షన్. పోలింగ్ అయిపోయిన తర్వాత కౌంటింగ్ టెన్షన్. సోమవారం ఉదయం కౌటింగ్ మొదలయ్యే వరకూ ఈ టెన్షన్ తప్పదు. మామూలుగా అయితే ఇంత టెన్షన్ అవసరం లేదు. మరెందుకింత టెన్షన్ ?

ఎందుకంటే, రెండు ప్రధాన కారణాలును చెప్పకోవచ్చు. మొదటిదేమో నంద్యాల ఫిరాయింపు నియోజకవర్గం కాబట్టి. రెండోది నంద్యాల కౌంటిగ్ మరుసటి రోజే కాకినాడ కార్పొరేషన్లో పోలింగ్. అంటే నంద్యాల రిజల్ట్ ప్రభావం కాకినాడ పోలింగ్ పై పడుతుందని రాజకీయ పార్టీలు భావిస్తుండటమే కారణం.   

దానికితోడు నంద్యాల ఓటింగ్ సరళి వెలుగు చూసింది. వివరాల ప్రకారం మొత్తం 2.18 లక్షల ఓట్లున్నాయి. ఇందులో పోలైన ఓట్లు 1.73 లక్షలు మాత్రమే. మొత్తం మీద పోలింగ్ పర్సెంట్ 79.13. ఇందులో గోస్సాడు మండలంలోని 28,844 ఓట్లకు గాను 26,193 పోలయ్యాయి. నంద్యాల రూరల్ మండలంలోని 47,386 ఓట్లలో 41,512 ఓట్లు పోలయ్యాయి.

అంటే ఈ రెండు మండలాల్లో పోలింగ్ దాదాపు 89 శాతం. ఇక మిగిలింది నంద్యల పట్టణమే. ఇక్కడున్న 1,42,628 ఓట్లలో పోలైంది 1.05,484 (74) మాత్రమే. అంటే సుమారు 37 వేల ఓట్లు పోలవ్వలేదు.

హోరా హోరీగా సాగిన ఎన్నికలో కూడా నంద్యాల పట్టణంలోని 37 వేలమంది ఓటర్లు ఓటింగ్ లో పాల్గొనలేదంటే ఏమని అర్దం? గ్రామీణ ప్రాంతాల్లోని రెండు మండలాల్లోని ఓటర్లు మాత్రం ఉదయం నుండే పోలింగ్ కేంద్రాల వద్ద పోటెత్తారు. మరి, పట్టణ ఓటర్లలో ఎందుకంత నిర్లిప్తత? దీని వల్ల ఏ పార్టీకి నష్టమో స్పష్టంగా అంచనా వేయలేని పరిస్ధితి.

రెండు పార్టీల నేతలు కూడా తామే గెలుస్తామని పైకి చెబుతున్నా వాస్తవమేంటన్న విషయం ఇరువైపుల నేతలకూ బాగా తెలుసు. పట్టణ ప్రాంతంలో ఓటింగ్ తగ్గితే ఏ పార్టీపై ప్రభావం చూపుతుందో, గ్రామీణ ప్రాంతాల్లో పోటెత్తిన ఓటింగ్ శాతం ఎవరికి లాభిస్తుందో అన్న ఆందోళనలో టిడిపి, వైసీపీ నేతల్లో ఆందోళన పెరిగిపోతోంది.

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Naidu Speech | సెమీ క్రిస్మస్ వేడుకల్లో చంద్రబాబు నాయుడు | Asianet News Telugu
Kandula Durgesh Super Speech: ప్రతీ మాట ప్రజా సంక్షేమం కోసమే మాట్లాడాలి | Asianet News Telugu