చంద్రబాబులో సీట్ల టెన్షన్...రివర్స్ వలసలు తప్పవా ?

Published : Nov 04, 2017, 08:21 AM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
చంద్రబాబులో సీట్ల టెన్షన్...రివర్స్ వలసలు తప్పవా ?

సారాంశం

సీట్ల పెంపు సాధ్యం కాదని కేంద్రం ఇప్పటికే అనేకమార్లు తేల్చేసింది. అయినా చంద్రబాబు పదే పదే అదే డిమాండ్ ను ఎందుకు పునరావృతం చేస్తున్నారు.

‘చిన్న రాష్ట్రాలు సుస్ధిరంగా ఉండాలంటే అసెంబ్లీ సీట్లను పెంచటం మినహా వేరే మార్గం లేదు’

-ఇది చంద్రబాబు తాజాగా ఢిల్లీలో చెప్పిన మాటలు. సీట్ల పెంపు సాధ్యం కాదని కేంద్రం ఇప్పటికే అనేకమార్లు తేల్చేసింది. అయినా చంద్రబాబు పదే పదే అదే డిమాండ్ ను ఎందుకు పునరావృతం చేస్తున్నారు. అంటే సీట్ల టేన్షన్ మొదలైనట్లే కనబడుతోంది. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ల కోసం ఇటు ఫిరాయింపు ఎంఎల్ఏలు అటు పార్టీలోని సీనియర్ నేతల నుండి ఒత్తడి మొదలైంది. దాన్ని తట్టుకోలేకే మళ్ళీ సీట్ల సంఖ్య పెంచాలని, కసరత్తు చేస్తున్నట్లు కేంద్రం చెప్పిందని మొదలుపెట్టారు.  

ఫిరాయింపులు, నేతల సెగ చంద్రబాబుకు బాగా తగులుతోంది. వచ్చే ఎన్నికల్లో సీట్ల సంఖ్య పెరుగుతుందన్న ఉద్దేశ్యంతో జోరుగా ఫిరాయింపులను ప్రోత్సహించారు. విభజన చట్టంలో చెప్పినట్లుగా సీట్ల సంఖ్యను 175 నుండి 225కి పెంచాలంటూ అప్పట్లో కేంద్రాన్ని చాలాసార్లే కోరారు. ఎలాగూ మిత్రపక్షమే కాబట్టి, అందులోనూ కేంద్రంలో వెంకయ్యనాయుడున్నారు కాబట్టి సీట్ల సంఖ్య పెరుగుతుందన్న ధీమాతో 21 మంది వైసీపీ ఎంఎల్ఏలను లాక్కున్నారు.

ఫిరాయింపు ఎంఎఎల్ఏలకైనా, పార్టీ నియోజకవర్గాల ఇన్చార్జిలకైనా చంద్రబాబు చెప్పిందొకటే. సీట్ల సంఖ్య పెరుగుతుంది కాబట్టి అందరికీ టిక్కెట్లను సర్దుబాటు చేస్తానని. అయితే, సీట్ల సంఖ్యను పెంచేది లేదని కేంద్రం స్పష్టంగా చెప్పటంతో చంద్రబాబుకు ఇబ్బందులు మొదలయ్యాయి. రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం మొదలైపోయింది. దాంతో ఎన్నికల్లో పోటీ కోసం ఎవరికి వారు సిద్ధమైపోతున్నారు.

 ఈ నేపధ్యంలోనే టిక్కెట్లపై హామీ కోసం చంద్రబాబుపై అందరూ ఒత్తిడి తెస్తున్నారు. దాంతో వారికి ఏం చెప్పాలో అందరినీ ఎలా సర్దుబాటు చేయాలో అర్ధం కాక చంద్రబాబులో టెన్షన్ మొదలైంది. సీట్ల సంఖ్య కూడా పెరగవని తేలిపోవటంతో టిడిపిలోని పలువురు నేతలు వైసీపీవైపు చూస్తున్నారట. అందులోనూ ఫిరాయింపు ఎంఎల్ఏలున్న నియోజకవర్గాల్లోని నేతలు  ఎక్కువగా టిడిపిని వదిలేసేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం.

రివర్స్ వలసలు గనుక మొదలైతే చంద్రబాబుకు ఇబ్బందులు తప్పవు. అందుకనే మళ్ళీ కొత్త డ్రామాలు మొదలుపెట్టారు. సీట్ల సంఖ్యపై హోంశాఖ మంత్రి రాజ్ నాధ్ సిగ్, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో మాట్లాడానని చెబుతున్నారు. సీట్ల సంఖ్యపై కసరత్త జరుగుతోందని వారిద్దరూ తనతో చెప్పారంటూ చంద్రబాబు కొత్త రాగం అందుకున్నారు. ఇదంతా ఎందుకంటే, రివర్స్ వలసలను నివారించేందుకే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జగన్ పాదయాత్రలో పలువురు తమ్ముళ్ళు వైసీపీలోకి వెళతారంటూ ప్రచారం మొదలైంది. చూడాలి ఏం జరుగుతుందో?

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ కుండపోత వర్షాలు, వరదలు... ఇక్కడ కూడా వానలు షురూ..!
Hello Lokesh Interaction: హలో లోకేష్ కార్యక్రమంలోవిద్యార్థులతో లోకేష్ పంచ్ లు | Asianet News Telugu