బెడిసికొడుతున్న వ్యూహాలు..షాకిచ్చిన ప్రతిపక్షాలు

First Published Apr 7, 2018, 7:19 AM IST
Highlights
శనివారం ఏర్పాటు చేసిన అఖిలపక్షానికి హాజరయ్యేది లేదని తెగేసి చెప్పటంతో ఏం చేయాలో దిక్కుతోచటం లేదు.

చంద్రబాబుకు రాష్ట్రంలోని ప్రతిపక్షాలన్నీ దారుణంగా షాకిచ్చాయి. శనివారం ఏర్పాటు చేసిన అఖిలపక్షానికి హాజరయ్యేది లేదని తెగేసి చెప్పటంతో ఏం చేయాలో దిక్కుతోచటం లేదు.

చంద్రబాబునాయుడు వ్యూహాలు దారుణంగా బెడిసికొడుతున్నాయ్. మూడున్నరేళ్ళపాటు కేంద్రంతో అంటకాగి తీరా ఎన్నికలొస్తున్న సమయంలో ప్రత్యేకహోదా ఉద్యమానికి తానే నాయకత్వం వహిస్తున్నట్లు కలరింగ్ ఇద్దామని చంద్రబాబు అనుకున్నారు.

అక్కడే రాష్ట్ర రాజకీయాల్లో సిఎం ఒంటరైపోయారు. రాష్ట్రంలోని పార్టీలన్నీ తన అదుపాజ్ఞాల్లోనే ఉన్నాయని కేంద్రానికి చాటిచెప్పాలన్నది చంద్రబాబు ప్లాన్. ఆ ప్లాన్ను ప్రతిపక్షాలన్నీ పసిగట్టాయి. అందుకే వారం క్రితం చంద్రబాబు ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి వైసిపి, జనసేన, బిజెపిలు హాజరుకాలేదు.

దాంతోనే చంద్రబాబుకు సీన్ అర్ధమైపోయింది. ఏదో నాటకాలాడుతూ ఉద్యమాలంటూ నెట్టుకొస్తున్నారు. తాజాగా ఈరోజు రెండోసారి మళ్ళీ అఖిలపక్ష సమావేశాలంటూ చంద్రబాబు హడావుడి చేస్తున్నారు. అన్నీ పార్టీలకూ శుక్రవారం రాత్రికి ఆహ్వానాలు పంపారు.

ఇక్కడే చంద్రబాబుకు తలబొప్పి కొట్టింది.   మొన్నటి సమావేశానికి హాజరైన వామపక్షాలు, ప్రత్యేకహోదా సాధన సమితి లాంటి చిన్నా చితకా ప్రజాసంఘాలు కూడా హాజరుకామంటూ స్పష్టంగా చెప్పాయి.

అటు ఢిల్లీలోనూ ఎంపిలు అబాసుపాలయ్యారు. ఇక్కడ అమరావతిలోనూ రాజకీయంగా ఒంటరైపోయారు. దాంతో ఏం చేయాలో చంద్రబాబుకు అర్ధం కావటం లేదు.

click me!