40 ఏళ్ళ అనుభవాన్ని ఎండగట్టిన కాగ్

First Published Apr 6, 2018, 5:44 PM IST
Highlights
రాష్ట్ర ప్రభుత్వం 2016-17 లో వివిధ సంస్తలు కంపెనీల్లో పెట్టిన 8975 కోట్ల పెట్టుబడి పై కేవలం రూ. 4 కోట్ల ఆదాయం మాత్రమే సాధించటంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

చంద్రబాబునాయుడు 40 ఏళ్ళ రాజకీయ పాలనా అనుభవాన్ని తీవ్రంగా ఎండగట్టింది. అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం రుణాల పై ఒక వైపు అధిక  వడ్డీ రేట్లను చెల్లిస్తూ మరో వైపు భారీ మొత్తలని పీడీ ఖాతాల్లో ఉంచడం అనేది ప్రభుత్వం పేలవమైన నగదు ద్రవ్య నిర్వహణను తెలియజేస్తోందని మండిపడింది.

రాష్ట్ర ప్రభుత్వం 2016-17 లో వివిధ సంస్తలు కంపెనీల్లో పెట్టిన 8975 కోట్ల పెట్టుబడి పై కేవలం రూ. 4 కోట్ల ఆదాయం మాత్రమే సాధించటంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. 2016-17 లో ఈ పెట్టుబడుల సగటు ప్రతిఫలం రేటు అత్యధికంగా 0.05 మాత్రమే ఉందని తేల్చింది.

రాష్ట్ర ప్రభుత్వం 2017 మార్చ్ 31 నాటికి రూ. 7,68,888 కోట్ల రుణబకాయిలను తీర్చాల్సి ఉంటుందన్నది. ఈ చర్య ఆయా సంవత్సరాల ప్రభుత్వ బడ్జెట్ ల పై భారాన్ని మోపుతుందని అభిప్రాయపడింది.

కేంద్ర ఉదయ్ పధకం కింద ప్రభుత్వం రూ.  8256 .01 కోట్లు విడుదల చేస్తే  రూ. 6464.39 కోట్ల రుణాలు ఇంకా మిగిలే ఉండటమేంటటూ మండిపడింది.  ఇప్పటి వరకు డిస్కం కొత్తగా ఎలాంటి బాండ్లను జారీ చేయక పోవటాన్ని తప్పుపట్టింది.

రాష్ట్ర ప్రభుత్వం ఆర్దిక నియమాలు , విధానాలు పాటించకపోవడం ఆర్దిక నియంత్రణ లేకపోవడం వంటి వివిధ సంధర్భాలను ఆడిట్ చాలా సందర్భాల్లో తప్పు బట్టింది

 

 

click me!