ఫిరాయింపుల్లో ఆందోళన: హై కోర్టు సంచలనం

First Published Mar 14, 2018, 12:23 PM IST
Highlights
  • అప్పట్లో ఏవో ప్రలోభాలకు లొంగిపోయి టిక్కెట్టిచ్చి గెలిపించుకున్న వైసిపిని కాదని టిడిపిలోకి జంప్ చేశారు.

ఫిరాయింపు ఎంఎల్ఏల్లో ఆందోళన పెరిగిపోతోంది. తాజాగా హైకోర్టు ఇచ్చిన నోటీసులతో ఏం చేయాలో దిక్కుతోచటం లేదు. అప్పట్లో ఏవో ప్రలోభాలకు లొంగిపోయి టిక్కెట్టిచ్చి గెలిపించుకున్న వైసిపిని కాదని టిడిపిలోకి జంప్ చేశారు. సరే కొందరి విషయంలో చంద్రబాబునాయుడు హామీలను నెరవేర్చారు. చాలామంది విషయంలో మాత్రం మాట తప్పారని ప్రచారంలో ఉంది. అందుకనే పలువురు ఫిరాయింపుల్లో చంద్రబాబుపై తీవ్ర అసంతృప్తి పేరుకుపోయింది.

అందుకనే తాము తిరిగి వైసిపిలోకి వచ్చేస్తామంటూ కొందరు రాయబారాలు మొదలుపెట్టినట్లు సమాచారం. దానికి అనుగుణంగానే జగన్, విజయాసాయి కూడా స్పందించారు. భే షరతుగా వైసిపిలోకి వచ్చేట్లయితే అభ్యంతరాలు లేవని స్పష్టంగా చెప్పారు. దాంతో ఏం చేయాలో ఫిరాయింపులకు అర్దం కావటం లేదు. వచ్చే ఎన్నికల్లో ఇటు టిడిపిలో కావచ్చు. లేదా అటు వైసిపిలోనూ కావచ్చు టిక్కెట్లు దక్కటం మాత్రం అనుమానమే.

తాము చేసిన పొరబాటు వల్ల మొత్తం రాజకీయ భవిష్యత్తే దెబ్బతిందని పలువురు ఫిరాయింపులు ఆందోళన పడుతున్నారు. కోడుమూరు ఎంఎల్ఏ మణిగాంధి చేసిన ప్రకటనే ఫిరాయింపుల్లోని ఆందోళనలకు అద్దం పడుతోంది.

ఇటువంటి నేపధ్యంలోనే ఫిరాయింపులపై సమాధానాలు చెప్పాలంటూ హై కోర్టు మొత్తం 22 మంది ఎంఎల్ఏలకు నొటీసులు ఇవ్వటం సంచలనంగా మారింది. కేసు విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. అంటే అప్పటిలోగా ఫిరాయింపులందరూ ఏదో ఒక సమాధానం చెప్పుకోవాలి. లేకపోతే మ్యాటర్ సీరియస్ అయ్యే అవకాశాలున్నాయి. అందుకనే ఫిరాయింపుల్లో ఒక్కసారిగా ఆందోళన పెరిగిపోతోంది.

click me!