కుప్పం : టీడీపీ నేతల అరెస్ట్‌కు యత్నం... ఉద్రిక్తత, పోలీసులతో అమర్‌నాథ్ రెడ్డి వాగ్వాదం

Siva Kodati |  
Published : Nov 14, 2021, 07:08 PM IST
కుప్పం : టీడీపీ నేతల అరెస్ట్‌కు యత్నం... ఉద్రిక్తత, పోలీసులతో అమర్‌నాథ్ రెడ్డి వాగ్వాదం

సారాంశం

చిత్తూరు జిల్లా (chittoor district) కుప్పంలో (kuppam) టీడీపీ (tdp) నేతలు అమర్నాథ్‌రెడ్డి (amarnath reddy), పులివర్తి నానీని (pulivarthi nani) పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. 

చిత్తూరు జిల్లా (chittoor district) కుప్పంలో (kuppam) టీడీపీ (tdp) నేతలు అమర్నాథ్‌రెడ్డి (amarnath reddy), పులివర్తి నానీని (pulivarthi nani) పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. కుప్పంలో బయటి వ్యక్తులు తిష్టవేస్తున్నారంటూ అక్కడికి వెళ్లిన టీడీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు యత్నించారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. దీంతో రహదారికి ఇరువైపులా భారీ స్థాయిలో వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (ysr congress party) నేతలకు కొమ్ముకాస్తున్నారని టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. కుప్పం నుంచి బయటి వ్యక్తులను పంపించకుండా తమపై జులుం చేయడమేంటని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు కుప్పం 23 వార్డులో వైసీపీ (ysrcp) శ్రేణులు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని టీడీపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. ఈ క్రమంలో వైసీపీ - టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు.  

Alo REad:ఏపీ స్థానిక ఎన్నికలు: ముగిసిన ప్రచారం.. రేపటి నుంచి ఎలక్షన్స్, కుప్పంపైనే అందరి దృష్టి

ఆంధ్రప్రదేశ్‌లో మిగిలిపోయిన స్థానిక సంస్థలకు ఎన్నికలకు శనివారంతో ప్రచారగడువు ముగిసింది. కుప్పం మున్సిపాలిటీపైనే  అందరి దృష్టి నెలకొంది. టీడీపీ కంచుకోటను బద్ధలు కొట్టాలని వైసీపీ ప్రయత్నిస్తోంది. కాగా.. ఆంధ్రప్రదేశ్‌లో మిగిలిన కార్పొరేషన్‌, స్థానిక సంస్థల ఎన్నికలకు (ap local body elections) షెడ్యూల్‌ విడుదలైన సంగతి తెలిసిందే. నవంబర్ 14, 15, 16 తేదీల్లో స్థానిక ఎన్నికలు జరగుతాయని ఈసీ నోటిఫికేషన్‌లో తెలిపింది. గతంలో వివిధ కారణాలతో ఎన్నికలు నిర్వహించని నెల్లూరు కార్పొరేషన్ సహా మున్సిపాలిటీలు, డివిజన్లు, వార్డులతో పాటు జెడ్పీటీసీ, ఎంటీటీసీ స్థానాలకు, పంచాయతీలకు ఎన్నికలను నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం  నోటిఫికేషన్ జారీచేసింది.

నెల్లూరు కార్పొరేషన్‌ సహా 12 మున్సిపాలిటీలకు, 533 పంచాయతీ వార్డులు, 69 సర్పంచ్‌ పదవులు, 85 ఎంపీటీసీలు, 11 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అలాగే.. 7 కార్పొరేషన్లలో 12 డివిజన్లకు, 12 మున్సిపాలిటీల్లో మిగిలిపోయిన 13 వార్డులకు ఎన్నిక జరగనుంది. అన్ని ఎన్నికలకు సంబంధించి ఈ నెల 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించారు. పంచాయతీలకు ఈ నెల 14న పోలింగ్‌, అదే రోజు కౌంటింగ్‌ జరగనుంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఈనెల 15న పోలింగ్‌, 17న కౌంటింగ్‌ నిర్వహించనున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు ఈ నెల 16న పోలింగ్‌, 18న ఓట్ల లెక్కింపు జరపనున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Humanoid Robot Introduced at Visakhapatnam Railway Station | Waltair Division | Asianet News Telugu
Palla Srinivas on Lokesh Birthday: లోకేష్అంటే నమ్మకం.. నిత్యంప్రజల్లోనే ఉంటారు | Asianet News Telugu