టీడీఎల్పీ భేటీ: ఐదుగురు ఎమ్మెల్సీలు డుమ్మా, బాబుకు షాకిస్తారా?

By narsimha lodeFirst Published Jan 26, 2020, 1:34 PM IST
Highlights

టీడీఎల్పీ సమావేశానికి ఐదుగురు ఎమ్మెల్సీలు గైర్హాజర్ అయ్యారు. ఐదుగురు ఎమ్మెల్సీలు దూరం కావడంతో ఆ పార్టీ నాయకత్వంలో టెన్షన్ మొదలైంది.

విజయవాడ: శాసమండలి రద్దు చేస్తామని ఏపీ ప్రభుత్వం సంకేతాలు ఇస్తున్న తరుణంలో అనుసరించాల్సిన వ్యూహాంపై టీడీఎల్పీ  ఆదివారం నాడు విజయవాడలోని పార్టీ కార్యాలయంలో మధ్యాహ్నం చంద్రబాబునాయుడు అధ్యక్షతన ప్రారంభమైంది. 

Also read:ఏపీ శాసనమండలిలో పాలనా వికేంద్రీకరణ బిల్లు: కౌంటర్ వ్యూహాంతో టీడీపీ

ఈ సమావేశానికి నలుగురు ఎమ్మెల్సీలు గైర్హాజరయ్యారు. ఐదుగురు ఎమ్మెల్సీలు గైర్హాజర్ కావడంతో  ప్రస్తుతం చర్చకు దారితీసింది.అధికార పార్టీకి చెందిన నేతలు తమ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులపై ఒత్తిడి తీసుకొస్తున్నారని టీడీపీ ఆరోపణలు చేస్తోంది.

శాసనమండలిని రద్దు చేసేందుకు వీలుగా ఈ నెల 27వ తేదీన ఏపీ అసెంబ్లీ సమావేశం కాబోతోంది. అదే రోజున ఉదయం ఏపీ కేబినెట్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో  శాసనమండలిని రద్దుకు సంబంధించిన తీర్మానానికి ఆమోదం తెలిపే అవకాశం ఉంది.

ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని అనుసరించాల్సిన వ్యూహాంపై చంద్రబాబునాయుడు  అధ్యక్షతన   టీడీఎల్పీ సమావేశమైంది. ఈ సమావేశానికి నలుగురు ఎమ్మెల్సీలు దూరంగా ఉన్నారు. వ్యక్తిగత కారణాలతోనే ఈ నలుగురు ఎమ్మెల్సీలు దూరంగా ఉంటున్నట్టుగా ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఎమ్మెల్సీలు సరస్వతి, ప్రభాకర్, తిప్పేస్వామి,  శత్రుచర్ల విజయరామరాజులు శాసనసభపక్ష సమావేశానికి దూరంగా ఉన్నారు.వ్యక్తిగత కారణాలతోనే తాము ఈ సమావేశానికి దూరంగా ఉండాల్సి వచ్చిందని పార్టీ నాయకత్వానికి ఈ నలుగురు ఎమ్మెల్సీలు సమాచారం ఇచ్చారు.మరో ఎమ్మెల్సీ పార్టీ నాయకత్వానికి సమాచారం ఇవ్వకుండా గైర్హాజర్ అయ్యారు. 

ఏపీ శాసనమండలిలో పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ బిల్లు రద్దు బిల్లులపై శాసనమండలిలో జరిగిన  ఓటింగ్ లో టీడీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలు పోతుల సురేష్,  శివనాథ్ రెడ్డిలు షాకిచ్చారు. ప్రభుత్వానికి అనుకూలంగా వీరిద్దరూ ఓటేశారు.

దీంతో వీరిద్దరిపై అనర్హత వేటు వేయాలని శాసనమండలి ఛైర్మెన్ కు టీడీపీ నాయకత్వం  శాసనమండలి ఛైర్మెన్ షరీఫ్‌కు నోటీసులు ఇచ్చింది. పోతుల సురేష్, శివనాథ్ రెడ్డిలు వైసీపీలో చేరారు.

ఇక  మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్‌‌లు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా  చేశారు. అనారోగ్య కారణాలతో  ఎమ్మెల్సీ శమంతకమణి శాసనమండలికి గైర్హాజర్ అయ్యారు. శాసనమండలిని సమావేశపరిస్తే తాము సమావేశానికి హాజరౌతామని ఎమ్మెల్సీలు పార్టీ నాయకత్వానికి సమాచారం ఇచ్చారు. మాజీ మంత్రి, టీడీఎల్పీ శాసనసభపక్ష ఉపనాయకుడు అచ్చెన్నాయుడు పార్టీ ఎమ్మెల్సీలతో సంప్రదింపులు జరుపుతున్నారు. 

ఇక శాసనమండలిని ఈ నెల 27వ తేదీన హాజరుపర్చడం లేదు. కేవలం అసెంబ్లీ మాత్రమే హాజరుపర్చనున్నారు. ఏపీ అసెంబ్లీలో  శాసనమండలిని రద్దు చేసే విషయమై తీర్మానం చేసే అవకాశం ఉంది. శాసనమండలిని  రద్దు చేసే తీర్మానం ప్రభుత్వం ముందుకు తీసుకువస్తే ఏం చేయాలనే దానిపై టీడీఎల్పీ సమావేశం చర్చిస్తోంది.

శాసనమండలిని రద్దు చేయాలని ఏపీ అసెంబ్లీలో తీర్మానం కోసం అసెంబ్లీని సమావేశం పరుస్తున్నందున ఈ సమావేశానికి హాజరుకావాలా వద్దా అనే విషయమై కూడ టీడీఎల్పీ సమావేశంలో చర్చసాగుతోంది. 

click me!