
నిడదవోలు : డబ్బు ఎంతటి వారి మధ్యైనా చిచ్చు పెడుతుంది. రక్తసంబంధాల్ని మంటగలుపుతుంది. స్నేహితుల్ని శత్రువులుగా మారుస్తుంది. భార్యాభర్తల్ని బద్ద విరోదులుగా తయారు చేస్తుంది. అలాగే జరిగింది పూజారి హత్య విషయంలోనూ... స్వయానా తమ్ముడి కుమారుడే ఆస్తి కోసం.. సాక్షాత్ దేవాలయంలో పెదనాన్నను మట్టుబెట్టాడు.
West Godavari District నిడదవోలు మండలం తాడిమల్ల గ్రామ శివారులో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ఆవరణలో ఈనెల 21న జరిగిన Temple priest కొత్తలంక వెంకటనాగేశ్వరరావు హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఐదుగురు నిందితులను arrest చేసినట్లు నిడదవోలు సీఐ వెంకటేశ్వరరావు తెలిపారు. శనివారం సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలను ఆయన వెల్లడించారు. ఆస్తి తగాదాల కారణంగా నాగేశ్వర శర్మ తమ్ముడి కుమారుడు వీర వెంకట సుబ్రహ్మణ్యం.. మరో నలుగురితో కలిసి ఈ murder చేసినట్లు విచారణలో వెల్లడైనట్లు తెలిపారు. నిందితులు కొవ్వూరు మండలం వాడపల్లికి చెందిన హనుమంతరావు, ఆలపాటి రాఘవ, తూర్పు గోదావరి జిల్లా ఎల్చేరుకు చెందిన సురేష్, విజ్యేశ్వరంకు చెందిన షేక్ పీర్ మజీన్ ను అరెస్టు చేసినట్లు చెప్పారు.
కాగా, మార్చి 22న పశ్చిమగోదావరి జిల్లాలో ఒక పూజారి దారుణ హత్యకు గురయిన సంఘటన కలకలం రేపింది. జిల్లాలోని నిడదవోలు మండలం తాడిమల్ల గ్రామంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆలయ ఆవరణలో గుర్తుతెలియని వ్యక్తులు మార్చి 21న పూజారిని హత్య చేశారు. వివరాల్లోకి వెళితే తాడిమల్ల గ్రామంలోని శివాలయంలో నాగేశ్వరరావు (50) పూజారిగా పనిచేస్తున్నారు. ఉదయం నుంచి విధులు నిర్వర్తించే ఆయన రాత్రికి ఇంటికి చేరకుంటారు. అయితే సోమవారం రాత్రి నాగేశ్వరరావు ఇంటికి రాకపోవడంతో ఆయన భార్య ఆందోళన చెంది.. ఈ విషయాన్ని ఇతర కుటుంబ సభ్యులకు తెలిపింది.
ఈ క్రమంలోనే నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు ఆయన విధులు నిర్వర్తిస్తున్న శివాలయం వద్దకు వచ్చారు. అయితే ఆలయం వద్ద నాగేశ్వరరావు వాహనం కనిపించకపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. నాగేశ్వరరావు పొలం వద్ద గాలించగా అక్కడ కూడా ఆయన ఆచూకీ లభించలేదు. అయితే మంగళవారం తెల్లవారుజామున అనగా మార్చి 22న ఆలయ ఆవరణలోని నాగేశ్వరరావు దారుణ హత్యకు గురై కనిపించారు రక్తపుమడుగులో నాగేశ్వరరావు మృతదేహాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు స్థానికులు తెలిపారు ఈ విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని వివరాలను సేకరించారు. దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నాగేశ్వరరావు గత కొన్నేళ్లుగా ఆలయంలో పని చేస్తున్నారని స్థానికులు తెలిపారు.