తిరుపతి‌‌లో కాలేజ్ హాస్టల్‌లో విద్యార్థిని ఆత్మహత్య.. అదే కారణమా..?

Published : Mar 26, 2022, 12:40 PM IST
తిరుపతి‌‌లో కాలేజ్ హాస్టల్‌లో విద్యార్థిని ఆత్మహత్య.. అదే కారణమా..?

సారాంశం

చిత్తూరు జిల్లా తిరుపతిలోని పద్మావతి మహిళా జూనియర్‌ కళాశాలలో ఓ  విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. కేవీ పల్లి మండలం గర్నిమిట్లకు చెందిన విష్ణుప్రియ కాలేజ్ హాస్టల్‌లో ఆత్మహత్య చేసుకుంది.

చిత్తూరు జిల్లా తిరుపతిలోని పద్మావతి మహిళా జూనియర్‌ కళాశాలలో ఓ  విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. కేవీ పల్లి మండలం గర్నిమిట్లకు చెందిన విష్ణుప్రియ కాలేజ్ హాస్టల్‌లో ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణం కావొచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ప్రేమ వ్యవహారంలో కుటుంబ పెద్దలు అభ్యంతరం చెప్పడంతో ఆత్మహత్యకు పాల్పడిందని తెలిపారు. పోలీసులు హాస్టల్ కు చేరుకుని శవ పంచనామా నిర్వహించారు. అక్కడ లభ్యమైన ప్రేమ లేఖలు, ప్రియుడు పంపిన బహుమతులను స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

10వేల కోట్ల పెట్టుబ‌డులు, 4వేల మందికి ఉద్యోగాలు ఏపీలో భారీ ప్రాజెక్టు| Anantapur Wind Energy Project
జగన్‌కు రాఖీలు కట్టిన వైసీపీ కార్యకర్తలు | YS Jagan Celebrate Rakhi Pournami