ఫిబ్రవరి 24న తిరుపతి నగర 892వ పుట్టినరోజు వేడుకలు.. క్రీ.శ.1134లో శంకుస్థాపన చేసిన రామానుజాచార్యులు..

Published : Feb 21, 2022, 09:24 AM IST
ఫిబ్రవరి 24న తిరుపతి నగర 892వ పుట్టినరోజు వేడుకలు.. క్రీ.శ.1134లో శంకుస్థాపన చేసిన రామానుజాచార్యులు..

సారాంశం

తిరుపతి ఎమ్మెల్యే భూమనకరుణాకర్ రెడ్డి ఓ సంచలన ప్రకటన చేశారు. క్రీ.శ.1134, ఫిబ్రవరి 24న రామానుజాచార్యులు పవిత్ర నగరమైన తిరుపతికి శంఖుస్థాపన చేశారని, ఈ మేరకు ఆధారాలు లభించాయని తెలిపారు. 

తిరుపతి : ఈ యేడాది నుంచి యేటా ఫిబ్రవరి 24ను temple city తిరుపతి పుట్టినరోజు వేడుకలు నిర్వహించనున్నట్లు తిరుపతి ఎమ్మెల్యే Bhumana Karunakar Reddy తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. 1130వ సంవత్సరంలో సెయింట్, తత్వవేత్త శ్రీ Ramanujacharya ఫిబ్రవరి 24నే ఈ పవిత్ర నగరానికి foundation stone వేశారని.. ఆ రోజూనే ఇక మీదట Tirupati ఆవిర్భావదినోత్సవంగా నిర్వహిస్తామని తెలిపారు. 

11-12వ శతాబ్దానికి చెందిన రామానుజాచార్యులకు సంబంధించిన ఈ వివరాల గురించి భూమన కరుణాకర్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ, తిరుపతిలోని టిటిడి ఆధ్వర్యంలోని గోవిందరాజ స్వామి ఆలయంలో లభించిన శాసనాలు ఫిబ్రవరి 24-1130 నాటి వాస్తవాన్ని రుజువు చేస్తున్నాయని అన్నారు. ఈ పవిత్ర నగరాన్ని నిర్మించడానికి పునాది రాయి ఆ రోజే వేయబడిందని తెలిపారు.

"గోవిందరాజ స్వామి ఆలయం, దాని నాలుగు మాడ వీధులు, పూజారులు, బ్రాహ్మణులకు అగ్రహారాలు, ఆలయ సమీపంలోని ఇతర ప్రాంతాలు తరువాత క్రమంగా తిరుపతిని దేశంలోని హిందూ ప్రార్థనా స్థలాలలో ఒకటిగా మార్చడానికి ఏర్పడ్డాయి" అని భూమన పేర్కొన్నారు.

"ఈ పవిత్ర నగరంపుట్టినరోజు గురించి మనం చాలా కాలంగా అజ్ఞానంలో ఉన్నాం. అయితే, గోవిందరాజ స్వామి ఆలయంలో లభించిన శాసనాలు ఎటువంటి సందేహం లేకుండా నగరం పుట్టిన తేదీని నిర్ధారించాయి  ఇక నుండి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 24న తిరుపతి పుట్టినరోజుగా జరుపుకుంటుంది" అని YSRCP శాసనసభ్యుడు ప్రకటించారు.

ఈ ఏడాది తిరుపతి 892వ జయంతిని పురస్కరించుకుని గోవిందరాజస్వామి ఆలయ ప్రాంగణంలోని శ్రీరామానుజ క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, నాలుగు మాడ వీధుల్లో శోభాయాత్ర నిర్వహించనున్నారు.

ఇదిలా ఉండగా, ఫిబ్రవరి 18న మ‌హారాష్ఠ్ర రాజ‌ధాని ముంబాయిలో బాలాజీ ఆల‌యం నిర్మించేందుకు ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం టీటీడీకి భూమి కేటాయించింది. ఈ మేరకు గురువారం తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో టీటీడీ పాల‌క మండ‌లి స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి  మీడియాతో మాట్లాడుతూ ఈ వివ‌రాలు వెల్ల‌డించారు. ముంబాయిలోని బంద్రా ప్రాంత్రంలో మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం స్థ‌లం కేటాయించింద‌ని, ఆ స్థ‌లంలో టీటీడీ ఆల‌యం నిర్మిస్తుంద‌ని చెప్పారు. ఆల‌య నిర్మాణానికి కావాల్సినవ‌న్నీ స‌మ‌కూర్చేందుకు మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం సిద్దంగా ఉంటుంద‌ని ఆ రాష్ట్ర సీఎం ఉద్ద‌వ్ ఠాక్రే చెప్పార‌ని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ విష‌యంలో సీఎం ఉద్ద‌వ్ ఠాక్రేకు, ప‌ర్యాట‌క శాఖ మంత్రి ఆదిత్య ఠాక్రే కు కృత‌జ్ఞ‌త‌ల‌ని అన్నారు. 

వార్షిక బ‌డ్జెట్ ను ఆమోదించిన టీటీడీ పాల‌క మండ‌లి : తిరుమల తిరుపతి దేవస్థానం పాల‌క మండ‌లి 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ. 3,096.40 కోట్ల ఆదాయ అంచనాతో వార్షిక బడ్జెట్‌ను ఆమోదించింది. వచ్చే 12 నెలల ఆర్థిక ప్రణాళికను బడ్జెట్ సమావేశంలో సమీక్షించిన అనంతరం వార్షిక బడ్జెట్‌కు బోర్డు ఆమోదం తెలిపినట్లు టీటీడీ బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Odisha Governor Kambhampati Hari Babu Speechవిశాఖలో ఘనంగా మహా సంక్రాంతి వేడుకలు| Asianet News Telugu
CM Chandrababu at Naravaripalli నారావారి పల్లి లో గోమాతకి పూజ చేసిన సీఎం చంద్రబాబు| Asianet Telugu