ఎమ్మెల్యే పదవికి వల్లభనేని వంశీమోహన్ రాజీనామా చేయడంతో ఆ నియోజకవర్గం నుంచి దేవినేని అవినాష్ ను బరిలోకి దించాలనే యోచనలో వైసీపీ ఉన్నట్లు తెలుస్తోంది. వల్లభనేని వంశీమోహన్, యార్లగడ్డ వెంకట్రావులు సహాయ నిరాకరణ చేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో అవినాష్ అయితే బెటర్ అని కొందరు నేతలు భావిస్తున్నారట.
విజయవాడ: తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాష్ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. గురువారం సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ సమక్షంలో వైసీపీ తీర్ధం పుచ్చుకునే అవకాశాలు ఉన్నాయని పొలిటికల్ సర్కిల్ లో చర్చ జరుగుతుంది.
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఇసుక దీక్షకు ముగింపునకు ముందే అవినాష్ టీడీపీకి గుడ్ బై చెప్పే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బుధవారం గుణదలలోని తన స్వగృహంలో దేవినేని నెహ్రూ అనుచరులు, అభిమానులతో భేటీ అయ్యారు అవినాష్.
కార్యకర్తలు, దేవినేని నెహ్రూ అభిమానులు అంతా అవినాష్ కు టీడీపీలో జరుగుతున్న అవమానాలను ఎత్తిచూపారట. పార్టీలో సముచిత స్థానం ఇవ్వడం లేదని, కనీసం గౌరవించడం లేదని మండిపడ్డారట.
అలాగే నెహ్రూ అభిమానులకు తెలుగుదేశం పార్టీలో గుర్తింపు లేదని అవినాష్ ఎదుట ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీలో ఉంటూ అవమానాలను ఎదుర్కొనే కన్నా వైసీపీలో ఉంటే మంచిదని అవినాష్ కు సూచించారట.
అభిమానులు, కార్యకర్తల అభిప్రాయమే తన అభిప్రాయమని అవినాష్ సమావేశంలో తెలియజేశారట. కార్యకర్తల నిర్ణయమే తన నిర్ణయమని వైసీపీలో చేరాలన్న మీ ప్రతిపాదనను స్వాగతిస్తున్నట్లు అవినాష్ సమావేశంలో స్పష్టం చేశారని తెలుస్తోంది.
మరోవైపు ఎమ్మెల్యే పదవికి వల్లభనేని వంశీమోహన్ రాజీనామా చేయడంతో ఆ నియోజకవర్గం నుంచి దేవినేని అవినాష్ ను బరిలోకి దించాలనే యోచనలో వైసీపీ ఉన్నట్లు తెలుస్తోంది. వల్లభనేని వంశీమోహన్, యార్లగడ్డ వెంకట్రావులు సహాయ నిరాకరణ చేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో అవినాష్ అయితే బెటర్ అని కొందరు నేతలు భావిస్తున్నారట.
ఈ పరిణామాల నేపథ్యంలో గన్నవరం నియోజకవర్గంలో దేవినేని నెహ్రూ కుటుంబానికి మంచి పరిచయాలు ఉండటంతోపాటు తన సామాజిక వర్గం గెలుపును నిర్దేశించే అవకాశం ఉండటంతో అవినాష్ సైతం గన్నవరం నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు అంగీకారం తెలిపారని ప్రచారం జరుగుతుంది.
అయితే వల్లభనేని వంశీమోహన్ ఉపఎన్నికల్లో పోటీ చేస్తారా అన్న అంశంపై వైసీపీ నేతలను అడిగి తెలుసుకున్నారట. అయితే వంశీకి రాజ్యసభ లేదా ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం ఉందని స్పష్టం చేశారట. దాంతో పోటీకి సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
అంతేకాకుండా యార్లగడ్డ వెంకట్రావు, వల్లభనేని వంశీమోహన్ వర్గాల నుంచి ఎలాంటి సమస్యలు రావని అలాగే ఉపఎన్నికకు అయ్యే ఖర్చును సైతం వైసీపీయే భరిస్తోందని గట్టి హామీ ఇచ్చారట వైసీపీలోని కీలక నేతలు.
అయితే దేవినేని అవినాష్ ను గన్నవరం నియోజకవర్గం నుంచి బరిలోకి దించే అంశంపై వల్లభనేని వంశీమోహన్ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. యార్లగడ్డ వెంకట్రావును బరిలోకి దించితే పర్లేదు గానీ అవినాష్ ను ఎలా దించుతారంటూ అనుచరుల వద్ద వాపోయారట వల్లభనేని వంశీమోహన్.
ఈ వార్తలు కూడా చదవండి
video: దేవినేని అవినాశ్ పార్టీ మార్పు.... కార్యకర్తల సమావేశం మెజార్టీ అభిప్రాయమిదే
ఏపీలో చంద్రబాబుకు మరో షాక్: వైసిపీలోకి దేవినేని అవినాష్