నిపుణుల సలహాలు తీసుకున్నాం.. వ్యాపారస్థులవి కాదు: బాబుపై బొత్స సెటైర్లు

By Siva KodatiFirst Published Jan 29, 2020, 3:15 PM IST
Highlights

ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మంత్రి బొత్స సత్యనారాయణ. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన జీఎన్ రావు, బోస్టన్ కమిటీ నివేదికలను క్షుణ్ణంగా పరిశీలించామని, హైపవర్ కమిటీలోనూ చర్చించామని బొత్స స్పష్టం చేశారు

ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మంత్రి బొత్స సత్యనారాయణ. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన జీఎన్ రావు, బోస్టన్ కమిటీ నివేదికలను క్షుణ్ణంగా పరిశీలించామని, హైపవర్ కమిటీలోనూ చర్చించామని బొత్స స్పష్టం చేశారు.

రాజధాని విషయంలో చంద్రబాబులా వ్యాపారుల సలహాలు తీసుకోలేదని మంత్రి దుయ్యబట్టారు. చంద్రబాబు మాటల్లో నిలకడలేదని ఎద్దేవా చేశారు. రాజకీయ లబ్ధి కోసం ప్రతిపక్షనేత ఎలాగైనా మాట్లాడుతారని.. రోజుకో రకంగా మాట్లాడటం చంద్రబాబుకు అలవాటన్నారు.

Also Read:వద్దంటే మంగళగిరి వెళ్లావు: నారా లోకేష్ పై వల్లభనేని వంశీ ఘాటు వ్యాఖ్యలు

విశాఖపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని .. అన్ని కమిటీల నివేదికలను పరిశీలించిన తర్వాతే మూడు రాజధానుల నిర్ణయం చేశామని బొత్స స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, అన్ని వర్గాల ఆమోదంతోనే అధికార వికేంద్రీకరణ చేపట్టామని బొత్స తెలిపారు.

ఇంతకు వికేంద్రీకరణకు తెలుగుదేశం పార్టీ అనుకూలమా.. ప్రతికూలమా అని మంత్రి నిలదీశారు. శాసనమండలి విషయంలో చంద్రబాబు మాటలు ప్రజలు గమనించాలని.. తమ ప్రభుత్వం అనేక కోణాల్లో ఆలోచించే కమిటీలు వేసిందని సత్యనారాయణ తెలిపారు.

చంద్రబాబు విధానాల వల్లే ఏపీకి ఆర్ధిక ఇబ్బందులు వచ్చాయని, శివరామకృష్ణన్ కమిటీ సలహాలు చంద్రబాబు పట్టించుకోలేదని సత్తిబాబు మండిపడ్డారు.  విశాఖపట్నంలో లక్షా 75 వేలమందికి ఇళ్లు కట్టిస్తామని.. చెన్నై, ముంబై నగరాలకు తుఫాన్ ముప్పులేదా అని బొత్స సత్యనారాయణ నిలదీశారు. 

జిఎన్ రావు కమిటీ పనికిమాలిన కమిటీ అని, జిఎన్ రావు ను పనికిమాలిన వ్యక్తి అని, బోస్టన్ గ్రూప్ బోగస్ కమిటీ అని చంద్రబాబు విమర్శించారని బొత్స గుర్తుచేశారు. జిఎన్ రావు నివేదికను చెత్త బుట్టలో వేయమన్నారని, నివేదికను భోగి మంటల్లో వేసి  చంద్రబాబు, టీడీపీ నేతలు తగులబెట్టారని సత్యనారాయణ మండిపడ్డారు.

మళ్ళీ ఇప్పుడు జిఎన్ రావు కమిటీ వైజాగ్ లో ప్రకృతి వైపరీత్యాలు వస్తాయని చెప్పింది అంటున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. చెత్త బుట్టలో పడేసిన జిన్ రావు కమిటీ ఇప్పుడు చంద్రబాబుకు భగవద్గీతగా మారిందని, గతంలో శాసన మండలికి వ్యతిరేకంగా చంద్రబాబు మాట్లాడారని.. ఇప్పడు శాసన మండలిని సమర్థిస్తూ మాట్లాడుతూన్నారని సత్తిబాబు విమర్శించారు.

Also Read:వివేకా హత్యపై హైకోర్టులో సునీత పిటిషన్: వైఎస్ జగన్ కు చిక్కులు

చంద్రబాబు ప్రతి విషయంలోను యూ టర్న్ తీసుకుంటారని ఆయన దుయ్యబట్టారు. వైజాగ్ లో రాజధాని సముద్రం ఒడ్డున పెట్టలేదని, ప్రభుత్వ మీద మాట్లాడడానికి ఏమి లేక పోవడంతో రాజధాని అంశంపై వివాదం చేస్తున్నారని బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. 

click me!