తెలుగుదేశం పార్టీ మహానాడు వేదిక మార్పు..!

Published : May 15, 2022, 12:38 PM IST
తెలుగుదేశం పార్టీ మహానాడు వేదిక మార్పు..!

సారాంశం

తెలుగుదేశం పార్టీ మహానాడు వేదిక మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహానాడు వేదికను గుళ్లాపల్లి వద్ద గల మహి ఆగ్రోస్‌ ఆవరణలోకి మార్చాలని టీడీపీ నేతలు ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నారు. 

తెలుగుదేశం పార్టీ మహానాడు వేదిక మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు పార్టీ ప్రాథమిక నిర్ణయానికి వచ్చింది. వివరాలు.. టీడీపీ మహానాడును మే 27, 28 తేదీల్లో ప్రకాశం జిల్లా ఒంగోలు శివారులోకి త్రోవగుంట బృందావన్ గార్డెన్‌ వెనుక వైపు ఖాళీ స్థలంలో నిర్వహించాని తొలుత భావించారు. అయితే ఇటీవల కురిసిన వర్షాలకు ఆ ప్రాంతంలో భారీగా నీళ్లు నిలిచి.. ప్రాంతం మొత్తం బురదమయంగా మారింది. దీంతో ఒంగోలు  మిని స్టేడియంలో మహానాడు నిర్వహించాలని భావిచిన విద్యార్థులకు వేసవి శిక్షణ శిబిరం నడుస్తున్న కారణంగా.. మినీ స్టేడియం ఇవ్వలేమని చెప్పారు. 

ఈ క్రమంలోనే మద్దిపాడు మండలం గుళ్లాపల్లి వద్ద గల మహి ఆగ్రోస్‌ ఆవరణలోకి మార్చాలని టీడీపీ నేతలు ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే పలువురు టీడీపీ ముఖ్యనేతలు.. ఆ స్థలాన్ని పరిశీలించారు. అక్కడ దాదాపు 25 ఎకరాలకు పైగా స్థలం ఖాళీగా ఉంది. దానిని చదును చేసి బహిరంగ సభ నిర్వహించుకోవచ్చని టీడీపీ నేతలు భావిస్తున్నారు. అయితే బుధవారం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వచ్చి చూసి అధినేత చంద్రబాబుతో మాట్లాడిన తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్నారు. 

ఇక,  ప్రతి ఏడాది మూడు రోజులపాటు మహానాడును నిర్వహించేవారు. అయితే ఈ సారి మహానాడును రెండు రోజులు మాత్రమే నిర్వహిస్తున్నారు.  ఒంగోలు నగరంలో బసకు అవసరమైన సౌకర్యాలు పరిమితంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక, మహానాడులో భాగంగా తొలి రోజు మే 27న ప్రతినిధుల సభ నిర్వహిస్తారు. రెండో రోజు మే 28న మహానాడు కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులంతా హాజరయ్యేలా విస్తృత స్థాయిలో నిర్వహించాలని నిర్ణయించారు. ఇక, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు శత జయంతి వేడుకలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఈ సారి మహానాడుకు ఆయన కుటుంబ సభ్యులను ఆహ్వానించాలనే ఆలోచనలో టీడీపీ అధిష్టానం ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Hello Lokesh Interaction: హలో లోకేష్ కార్యక్రమంలోవిద్యార్థులతో లోకేష్ పంచ్ లు | Asianet News Telugu
Minister Nara Lokesh: మంత్రి లోకేష్ నే ర్యాగింగ్ చేసిన విద్యార్థి అందరూ షాక్| Asianet Telugu