నా గుండెలపై కూర్చొని కొట్టారు.. ఫోన్ కోసం వెతికి మరి చిత్రహింసలు : రఘురామ సంచలనం

By Siva KodatiFirst Published May 14, 2022, 10:00 PM IST
Highlights

సీఐడీ కస్టడీలో వుండగా తనను పోలీసులు విపరీతంగా కొట్టారని సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు. ఓ కానిస్టేబుల్ వచ్చి ఎవరు కొట్టారని తనను అమాయకంగా ప్రశ్నించారని ఆయన సెటైర్లు వేశారు. జగన్, సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ అద్భుతమైన కళాకారులన్నారు. 

సొంత పార్టీపై నిత్యం విమర్శలు చేస్తున్న వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. గతంలో సీఐడీ కస్టడీలో తనపై జరిగిన దాడిని ప్రస్తావించారు. ముఖ్యంగా సీఐడీ కస్టడీలో పోలీసులు తన గుండెలపై కూర్చుని విపరీతంగా కొట్టారని రఘురామ ఆరోపించారు. మొత్తం ఐదుసార్లు తనను పోలీసులు తీవ్రంగా కొట్టారని, మధ్యలో తన సెల్‌ఫోన్ కోసం వెతికి మరీ కొట్టారని రఘురామ ఆరోపించారు. ఓ కానిస్టేబుల్ వచ్చి తనను ఎవరు కొట్టారని అమాయకంగా అడిగారని, ఆ తర్వాత హెడ్ కానిస్టేబుల్ వచ్చి మంచంపై పడుకోబెట్టారని వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

సీఎం జగన్‌తో పాటు సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ ఇద్దరూ అద్భుతమైన కళాకారులని రఘురామ సెటైర్లు వేశారు. ఉన్మాద సంస్కృతిలో భాగంగానే తనపై దాడి జరిగిందని ఆయన దుయ్యబట్టారు. ఈరోజు తనకు 60వ పుట్టిన రోజు అని చెప్పిన రఘురామ.. 59వ పుట్టిన రోజును ఘనంగా జరిపిన ఉన్మాదికి ధన్యవాదాలు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 2024లోనే వారికి ప్రజలు బుద్ధి చెప్తారని రఘురామ కృష్ణంరాజు జోస్యం చెప్పారు. మరోవైపు ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న రఘురామకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (amit shah) ఫోన్‌లో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ పర్యటన తర్వాత రఘురామతో భేటీ కానున్నట్లు అమిత్ షా చెప్పినట్లు రఘురామ వెల్లడించారు. 

అంతకుముందు ఆంధ్రప్రదేశ్‌లో వరుసపెట్టి జరుగుతున్న హత్యలు, అత్యాచారాలపై వైసీపీ (ysrcp)  రెబల్ ఎంపీ  రఘురామ కృష్ణంరాజు (raghu rama krishna raju) మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లపై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఏపీలో 3 హ‌త్య‌లు, 6 మాన‌భంగాలు అని చెబుతుంటే బాధేస్తోంద‌ని ఆవేదన  వ్యక్తం చేశారు. లేని చ‌ట్టాల గురించి త‌మ‌ పార్టీ నేత‌లు మాట్లాడతారంటూ రఘురామ చురకలు వేశారు. ఏపీలో ఎక్కువ నేరాలు జ‌రుగుతున్నాయ‌ని క్రైమ్స్ రికార్డ్స్ బ్యూరో (national crime records bureau) వెల్ల‌డిస్తోంద‌ని ఆయన దుయ్యబట్టారు. 

మ‌హిళ‌లపై నేరాల్లో 2020లో ఏపీ 8 వ స్థానంలో ఉంద‌న్న ర‌ఘురామ‌.. ప‌ని ప్ర‌దేశాల్లో లైంగిక వేదింపుల ఘ‌ట‌న‌ల్లో ఏపీ రెండో స్థానంలో ఉందని వెల్లడించారు. అలాగే మ‌హిళ‌ల‌పై భౌతిక దాడుల్లో మొద‌టి స్థానంలో ఉందని ... 2019తో పోలిస్తే.. రాష్ట్రంలో 63 శాతం మేర నేరాలు పెరిగాయ‌ని రఘురామ కృష్ణంరాజు వివరించారు. ప్ర‌తి 3 గంట‌ల‌కు ఎస్సీల‌పై ఓ దాడి జ‌రుగుతోంద‌ని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 2021లో అత్య‌ధిక లాకప్ డెత్‌లు ఏపీలోనే న‌మోద‌య్యాయని, త‌న అదృష్టం బాగుండి పోలీసుల కస్టడీ నుంచి ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డాన‌ంటూ వ్యాఖ్యానించారు. శాంతి భ‌ద్ర‌త‌లు క‌ల్పించ‌లేని ప్ర‌భుత్వం ప్ర‌భుత్వ‌మే కాదని జగన్ (ys jagan) పాలనపై రఘురామ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

click me!