ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పవన్ కళ్యాణ్ సంచలన లేఖ రాశారు. వైసీపీ ప్రభుత్వం టార్గెట్‌గా లెటర్ రాశారు. టీడీపీ, జనసేన పొత్తు కన్ఫమ్ అయింది. ఇందులో బీజేపీని జతకూర్చే ప్రయత్నంలోనే పవన్ కళ్యాణ్ ఈ లేఖ రాసినట్టు ఊహాగానాలు నడుస్తున్నాయి.
PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన లేఖ రాశారు. వైసీపీ ప్రభుత్వం గృహ నిర్మాణాల్లో భారీ అవినీతికి పాల్పడుతున్నదని, వెంటనే సీబీఐతో దర్యాప్తు చేయించాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు. పేదలకు సొంతిళ్లు పేరుతో కేవలం స్థలాల పేరుతో రూ. 35,141 కోట్లు వెచ్చించిందని తెలిపారు. ఇందులో భఆరీ మొత్తంలో గోల్ మాల్ జరిగిందని ఆరోపించారు. ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టు వ్యయం రూ. 1,75,421 కోట్లు అయితే, ప్రభుత్వం మాత్రం రూ. 91,503 కోట్లు అని చెబుతున్నదని కామెంట్ చేశారు.
ఇళ్ల విషయంలో ప్రభుత్వం పేదలను మోసం చేస్తున్నదని, అంతేగాక, ప్రజా ధనాన్ని దుర్వినియోగపరుస్తున్నదని పవన్ కళ్యాణ్ ఆ లేఖలో ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 30 లక్షల గృహాలు నిర్మిస్తామని హామీ ఇచ్చిందని, కానీ, 29,51,858 మంది మహిళల పేరుతో స్థలాలు ఇవ్వాలని నిర్ణయించారని, అందులో వాస్తవంలో 21,87,985 మందినే లబ్దిదారులుగా గుర్తించారని తెలిపారు. కాగా, 12,09,022 మందికే ఇళ్ల స్థలాలు ఇచ్చారని పేర్కొన్నారు. ఇందులో పెద్ద మొత్తంలో అవకతవకలు జరిగినట్టుగా పవన్ కళ్యాణ్ ఆరోపించారు. సీబీఐతో దర్యాప్తు చేయించాలని తెలిపారు. పలుమార్లు, పలుమార్గాల్లో, భిన్నమైన ఖర్చును ప్రభుత్వం ప్రకటించిందని ఆరోపించారు. పత్రికా ప్రకటనలో భూసేకరణ కోసం రూ. 56,102 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపింది. మొదట చెప్పిన లెక్కకు, ఆ తర్వాత పత్రికలో చెప్పిన లెక్కకు వ్యత్యాసం చాలా ఉన్నదని పవన్ చెప్పారు. మొదట్లో కేవలం రూ. 35,151 కోటుల మాత్రమే ఖర్చు అని పేర్కొనట్టు వివరించారు. ఐదు రాష్ట్ర బడ్జెట్‌లలో రూ. 23,106.85 కోట్లు కేటాయించగా.. ఖర్చు చేసింది మాత్రం రూ. 11, 358.87 కోట్లు మాత్రమేనని అన్నారు. దీనికితోడు పీఎంఏవై కింద కేంద్రం నుంచి రూ. 14,366.08 కోట్లు విడుదలయ్యాయని గుర్తు చేశారు. దీనిపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని, వేల కోట్ల ప్రజా ధనం ఏ విధంగా పక్కదారి పట్టిందో బయటపడాలని అన్నారు.
Also Read: జగన్ చుట్టూ దద్దమ్మలు చేరిపోయారు.. ఎమ్మెల్సీ వంశీ కృష్ణ ( వీడియో )
అయితే, పవన్ కళ్యాణ్ ఈ లేఖ రాసిన సందర్భాన్ని గమనంలో పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న తరుణంలో ఈ లెటర్ రాశారు. టీడీపీ, జనసేన పొత్తు కన్ఫమ్ అయింది. ఈ రెండు పార్టీలతో బీజేపీ చేరడంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నది. త్వరలోనే ఈ పొత్తుపై బీజేపీ కూడా ఓ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉన్నది. పవన్ కళ్యాణ్‌తోపాటు, చంద్రబాబుకు కూడా బీజేపీ తమతో కలవాలనే కోరిక ఉన్నది. అందుకు బీజేపీ కూడా సుముఖంగానే ఉన్నట్టు కొన్ని సంకేతాలు వస్తున్నాయి. ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని లేఖ రాశారు. తద్వార ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలకుండా టీడీపీ, జనసేనలతోపాటు కలుపుకునిపోయేలా బీజేపీని కూడా ఇన్వాల్వ్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకే పవన్ కళ్యాణ్ ఈ కోణంలోనే కేంద్రానికి లేఖ రాశారా? అనే చర్చ జరుగుతున్నది.