ముగిసిన టీడీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ.. వీటిపై లేవనెత్తాలని ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం

By Siva KodatiFirst Published Nov 27, 2021, 7:46 PM IST
Highlights

వరద సాయంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం, జ్యుడీషియల్‌ విచారణ, జాతీయ విపత్తుగా ప్రకటించేలా కేంద్రపై ఒత్తిడి తేవాలని ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. త్వరలో జరగనున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాంపై టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది.

వరద సాయంలో (ap floods) రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం, జ్యుడీషియల్‌ విచారణ, జాతీయ విపత్తుగా ప్రకటించేలా కేంద్రపై ఒత్తిడి తేవాలని ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు టీడీపీ (tdp) అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) . త్వరలో జరగనున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో (parliament winter session) అనుసరించాల్సిన వ్యూహాంపై టీడీపీ పార్లమెంటరీ పార్టీ (tdp parliamentary party) సమావేశం జరిగింది. ఈ సందర్భంగా దేశంలోనే అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్‌, డీజిల్‌ (petrol diesel price) ధరలపై జగన్‌ ప్రభుత్వం పన్నులు, నిత్యావసరాల ధరల పెరుగుదల, ప్రత్యేక హోదా, 3 రాజధానుల బిల్లు వంటి అంశాలు పార్లమెంట్‌లో లేవనెత్తాలని సమావేశం నిర్ణయించింది. ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు గంజాయి (ganja), హెరాయిన్‌ సరఫరా అంశాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావించాలని చంద్రబాబు ఎంపీలకు సూచించారు. అలాగే విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు (vizag steel plant privatization) వ్యతిరేకంగా ఆందోళన చేయాలని తీర్మానించారు.  

ALso Read:పంట నష్టం అంచనాలో ఈ నిబంధనలేంటీ : జగన్‌కు నారా లోకేశ్ బహిరంగ లేఖ

వ్యాక్సినేషన్‌లో ఆంధ్రప్రదేశ్‌ వెనుకబడటంపైనా ప్రశ్నించాలన్నారు. దేశానికి అన్నపూర్ణగా పిలిచే ఆంధ్రప్రదేశ్‌లో వరి పంట వేయొద్దని మంత్రులు ప్రకటించిన అంశాన్ని కూడా పార్లమెంట్‌లో ప్రస్తావించాలని నిర్ణయించారు. వైఎస్‌ వివేకా హత్యకు (ys vivekananda reddy murder) సంబంధించి రూ.40కోట్ల సుపారీ, అడ్వాన్స్‌గా కోటి రూపాయల చెల్లింపులపై ఈడీ విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేయాలని చంద్రబాబు ఆదేశించారు. పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం ఇచ్చిన నిధుల మళ్లింపు, ఉపాధి హామీ నిధుల మళ్లింపు, ఈ ఏపీ నిధుల దారి మళ్లింపుపై ప్రశ్నించాలని ఎంపీలకు ఆయన సూచించారు. బీసీలకు రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్‌, కేశినేని నాని, కె.రామ్మోహన్‌నాయుడు, కనకమేడల రవీంద్ర కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.  

click me!