ఏపీలో కొత్త 248 మందికి కరోనా పాజిటివ్.. కృష్ణా జిల్లాలో ఉద్ధృతి

Siva Kodati |  
Published : Nov 27, 2021, 07:08 PM IST
ఏపీలో కొత్త 248 మందికి కరోనా పాజిటివ్.. కృష్ణా జిల్లాలో ఉద్ధృతి

సారాంశం

ఏపీలో కొత్తగా 248 కరోనా కేసులు (corona cases in ap) నమోదయ్యాయి, నిన్న ఒక్కరోజు 253 మంది కోలుకోగా.. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 2,158 మంది చికిత్స పొందుతున్నారు  


ఆంధ్రప్రదేశ్‌‌‌లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి (corona cases in ap). గడిచిన 24 గంటల్లో 248 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 20,69,551కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల ఎవరు ప్రాణాలు కోల్పోలేదు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా (corona deaths in ap) మరణించిన వారి సంఖ్య 14,432కి చేరుకుంది. 

నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 253 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 20,52,961కు చేరింది. గత 24 గంటల వ్యవధిలో 28,509 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 3,03,44,770కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 2,158 మంది చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్కరోజు అనంతపురం 10, చిత్తూరు 28, తూర్పుగోదావరి 38, గుంటూరు 39, కడప 12, కృష్ణ 56, కర్నూలు 1, నెల్లూరు 15, ప్రకాశం 4, శ్రీకాకుళం 16, విశాఖపట్నం 15, విజయనగరం 0, పశ్చిమ గోదావరిలలో 14 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు.
 

PREV
click me!

Recommended Stories

Schools Bandh : తెలుగు విద్యార్థులకు ఊహించని సెలవు... స్కూళ్లు, కాలేజీల బంద్ కు జేఏసి పిలుపు
Mystery of Hanging Pillar: సైన్స్‌కే సవాల్.. లేపాక్షి ఆలయంలో గాలిలో వేలాడే ఈ స్తంభం సీక్రెట్ ఇదే