బాపట్లలో దారుణం... తెలంగాణకు చెందిన మహిళా బ్యాంక్ మేనేజర్ ఆత్మహత్య

Arun Kumar P   | Asianet News
Published : May 23, 2022, 01:13 PM ISTUpdated : May 23, 2022, 01:20 PM IST
బాపట్లలో దారుణం... తెలంగాణకు చెందిన మహిళా బ్యాంక్ మేనేజర్ ఆత్మహత్య

సారాంశం

తెలంగాణ రాష్ట్రం సిరిసిల్ల జిల్లాకు చెందిన యువతి బాపట్ల జిల్లాలో బ్యాంక్ ఉద్యోగిగా పనిచేస్తూ అక్కడే సొంతింటిని నిర్మించుకుంది. అయితే ఏమయ్యిందో తేలీదు కానీ తన ఇంట్లో ఉరేసుకుని ఆమె మృతిచెందింది. 

బాపట్ల: ఆర్థిక ఇబ్బందులో లేక ఇతర కారణాలేమైనా వున్నాయో తెలీదుగాని నూతనంగా నిర్మించుకున్న ఇంట్లోనే బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన బాపట్ల జల్లా చెరుకుపల్లి మండలంలో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే... తెలంగాణ రాష్ట్రంలోని సిరిసిల్ల జిల్లాకు చెందిన బొల్లి దివ్యవాణి(31) ఇండియన్ బ్యాంక్ లో ఉద్యోగం చేస్తోంది. ఐదేళ్లుగా బాపట్ల జిల్లాలోని వివిధ ప్రాంతాల్లోని బ్రాంచుల్లో పనిచేసిన ఆమె ప్రస్తుతం నగరం మండలం మట్లాపూడి బ్రాంచ్ లో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తోంది.  

బ్యాంక్ ఉద్యోగి కావడంతో వివిధ శాఖల్లో పనిచేస్తున్న సమయంలో రుణాలు తీసుకుంది. ఇలా మొత్తం రూ.40లక్షల వరకు రుణం తీసుకుని గుళ్ళపల్లిలో మూడంతస్తుల నివాసభవనం నిర్మించుకుంది. ఈ ఇంటిని ఉప్పాల శ్రీనివాసరావు అనే వ్యక్తికి అద్దెక్కిచ్చి ఓ గదిలో ఆమె నివాసముంటోంది. 

ఇటీవల స్వస్థలం సిరిసిల్లకు వెళ్లిన దివ్యవాణి పనిఒత్తిడి కారణంగా ఇబ్బందిపడుతున్నట్లు తల్లిదండ్రులకు తెలిపింది. ఇదే సమయంలో ఆమెను ఆర్థిక సమస్యలు కూడా చుట్టుముట్టాయి. ఇవి భరించలేక తీవ్ర డిప్రెషన్ కు లోనయిన దివ్యవాణి దారుణ నిర్ణయం తీసుకుంది. 

శనివారం విధులు ముగించుకుని ఇంటికి చేరుకున్న దివ్యవాణి తన గదిలో నిద్రించారు. ఉదయం ఎంతకూ ఆమె బయటకు రాకపోవడంతో శ్రీనివాసరావు గదివద్దకు వెళ్లిచూడగా ఆమె ఉరితాడుకు వేలాడుతూ కనిపించింది. సీలింగ్ ఫ్యాన్ కు చున్నీతో ఉరేసుకుని ఆమె ఆత్మహత్య చేసుకుంది. 

వెంటనే శ్రీనివాసరావు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనంతరం మృతురాలి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. దీంతో తల్లి విమల, తండ్రి లక్ష్మీనారాయణ, సోదరుడ రామకృష్ణ బాపట్ల చేరుకుని పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని స్వాదీనం చేసుకున్నారు.  పని ఒత్తిడి, ఆర్థిక సమస్యలతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇదిలావుంటే పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఇలాంటి విషాద ఘటనే చోటుచేసుకుంది. ఉద్యోగాలు, పెళ్లిళ్ల కారణంగా కన్నబిడ్డలు దూరంగా ఉండడాన్ని భరించలేని ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. భర్త ఇంట్లో లేని సమయంలో కిరోసిన్ పోసుకుని నిప్పటించుకుని బలవనర్మణానికి పాల్పడింది. రూ. 7 లక్షల నగదు, బంగారు ఆభరణాలు, ఆస్తి పత్రాలకు కూడా తనతో పాటే నిప్పుపెట్టింది. 

దాచేపల్లి మండలం మాదినపాడుకు చెందిన కోట్ల రామారావు, కుమారి దంపతులు రెండున్నరేళ్ల నుంచి నరసరావుపేట రామిరెడ్డిపేటలో నివాసం ఉంటున్నారు. ఈ దంపతులకు సునీత, అనురాధ, ఆంజేయులు సంతానం ఉన్నారు. ముగ్గురికి వివాహాలు కావడం, ఉద్యోగాలతో వారు ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డారు. చిన్న కూతురు సునీత మూడు నెలల క్రితం అమెరికాకు వెళ్లింది. అయితే తన పిల్లలు దూరంగా ఉండటాన్ని కుమారి భరించలేకపోయింది. ఆఖరికి తనతో పాటు ఉన్న మనవడిని కూడా కూతురు తీసుకెళ్లిపోవడంతో మరింత మానసిక ఒత్తిడికి లోనైంది. దీంతో ఒంటిపై బంగారు నగలు ధరించి, రూ. 7లక్షల నగదు, ఆస్తి పత్రాలతో ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటిసుకుని బలవన్మరణానికి పాల్పడింది. 

(ఆత్మహత్య అనేది సమస్యకు పరిష్కారం కాదు. మీకు ఎటువంటి కౌన్సిలింగ్ సహాయం కావాలన్నా ఐకాల్ (9152987821), ఆసరా (09820466726) వంటి సంస్థలను సంప్రదించండి)
 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్