వివాహిత పేరుతో ఫేస్ బుక్ అకౌంట్.. అమ్మాయిగా పరిచయం చేసుకుని అసభ్యకర మెసేజ్ లు.. చివరికి...

By SumaBala BukkaFirst Published May 23, 2022, 12:07 PM IST
Highlights

సైబర్ మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. ముక్కూమొహం తెలియని వివాహిత పేరుతో ఫేక్ ఐడీ క్రియేట్ చేసి.. అమ్మాయిగా పరిచయం చేసుకుని.. అసభ్యకర మెసేజ్ లతో దారుణానికి తెగబడ్డాడో యువకుడు.

చిత్తూరు : ఓ married woman పేరిట Facebook fake account తెరిచాడు ఓ ప్రబుద్ధుడు. తనను తాను మహిళగా.. అమ్మాయిలను పరిచయం చేసుకొని మోసం చేస్తున్న నిందితుడిని ఐరాల పోలీసులు arrest చేశారు. ఈ వివరాలను ఆదివారం ఎస్ఐ హరిప్రసాద్ మీడియాకు వివరించారు. ఆ ప్రకారం ఐరాల మండలానికి చెందిన ఓ వివాహిత పేరుతో తవణంపల్లె  మండలం దిగువమారేడుపల్లెకు చెందిన అనిల్ ఫేస్బుక్ అకౌంట్ తెరిచాడు. అమ్మాయిలతో  స్నేహం చేస్తూ వారిని లొంగదీసుకోవడానికి ప్రయత్నించేవాడు. దీంతోపాటు వారికి అసభ్యకరమైన ఫోటోలను మెసేజ్లను.. పెట్టేవాడు. ఈ విషయాన్ని గమనించిన ఆ వివాహిత  మార్చిలో ఐరాల పోలీసులకు ఫిర్యాదు చేసింది.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు రహస్యంగా ఆ ఫేస్బుక్ అకౌంట్ ను ఐపీ అడ్రస్ ద్వారా ఆరా తీయడం ప్రారంభించారు. ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న అనిల్ ఫేస్బుక్ ద్వారా అమ్మాయిలను మభ్య పెడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో అతడిని ఇంటి వద్ద ఆదివారం అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఫేస్‌బుక్‌ను వినియోగించే మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలని ఎస్సై హరిప్రసాద్ సూచించారు. ఇలాంటి నయవంచకుల మాటల భ్రమలో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. ఇలాంటి ఘటనలు ఏవైనా ఉంటే ధైర్యంగా తమకు తెలియజేస్తే వారిని కాపాడుతామని హామీ ఇచ్చారు.

ఇదిలా ఉండగా,  కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ సైబర్ నేరగాడి వలలో పడి మోసపోయారు. మే 4న ఇది వెలుగులోకి వచ్చింది. మీ బ్యాంకు ఖాతా బ్లాక్ అయ్యిందని.. వెంటనే పాన్ నెంబర్ తో జత చేసి అప్డేట్ చేసుకోవాలంటూ సోమవారం ఓ మొబైల్ నెంబర్ నుంచి ఆయన సెల్ కు మెసేజ్ వచ్చింది.  దీంతోపాటు లింకు పంపించారు. ఆయన దానిని నమ్మి లింకులో వివరాలను నమోదు చేసి పంపగా ఓటీపీ నెంబర్ లు వచ్చాయి. ఆ తర్వాత అపరిచిత వ్యక్తి ఫోన్ చేసి హెచ్ డిఎఫ్ సి బ్యాంక్ కస్టమర్ కేర్ నుంచి మాట్లాడుతున్నట్లు పరిచయం చేసుకున్నాడు.

అకౌంట్ ఇతరత్రా వివరాలు, ఓటీపీ నెంబర్ లు అడిగి తెలుసుకున్నాడు. వివరాలన్నీ చెప్పిన వెంటనే ఎంపీ బ్యాంకు ఖాతా నుంచి రూ.48,700 ఒకసారి, రూ.48,999 మరోసారి డ్రా అయినట్లు సెల్ ఫోన్ కి మెసేజ్ లో సమాచారం వచ్చింది. దాంతో అనుమానం వచ్చి బ్యాంకుకు ఫోన్ చేయగా అసలు విషయం తెలిసింది. దాంతో సైబర్ నేరగాడు తనను మోసగించి మొత్తం రూ.97,699 తన అకౌంట్ నుంచి కాల్ చేసినట్లు ఎంపీ సంజీవ్ కుమార్ కర్నూలు టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో సోమవారం రాత్రి ఫిర్యాదు చేశారు. సిఐ శ్రీనివాసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇలాంటి మోసాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ‘సార్..  మేము బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాం. మీ ఏటీఎం బ్లాక్ అయ్యింది. మీ కార్డు వివరాలు చెప్తే మీ కార్డును తిరిగి అన్ బ్లాక్ చేస్తాం. అలాగే మీకు ఒక మెసేజ్ వ‌స్తుంది. అందులో ఉన్న‌ నెంబ‌ర్ మాకు చెప్పాల్సి ఉంటుంది.’’ అని తరచూ ప్రజలకు సైబర్ మోసగాళ్లు ఫోన్ చేస్తుంటారు. నిజంగా బ్యాంక్ అధికారులే కాల్ చేస్తున్నారనుకొని వారు అడిగిన వివరాలు అన్నీ చెప్తే.. అకౌంట్ నుంచి డ‌బ్బులు మాయం అవ‌డం ఖాయం. ఇలా ఇప్ప‌టి వ‌ర‌కు ఎంతో మంది అమాయ‌కులు మోస‌పోయారు.

click me!