వైఎస్ వివేకా హత్య కేసు: సునీల్‌కు బెయిల్ నిరాకరించిన హైకోర్టు

By narsimha lode  |  First Published Feb 27, 2023, 4:39 PM IST

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో  నిందితుడు  సునీల్ యాదవ్  దాఖలు చేసిన బెయిల్ పిటిషన్  ను  తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. 



హైదరాబాద్: మాజీ మంత్రి  వైఎస్ వివేకానందరెడ్డి హత్య  కేసులో  నిందితుడు  సునీల్ యాదవ్  దాఖలు  చేసిన   బెయిల్ పిటిషన్ ను  సోమవారం నాడు   తెలంగాణ హైకోర్టు  కొట్టివేసింది.  ఈ కేసు విచారణ దశలో  ఉన్నందున బెయిల్  ఇవ్వలేమని  హైకోర్టు తేల్చి చెప్పింది. 

వైఎస్ వివేకానందరెడ్డి హత్య  కేసును సీబీఐ విచారిస్తున్నందున   ఈ దశలో  బెయిల్ ఇవ్వలేమని  హైకోర్టు తేల్చి చెప్పింది.  నిందితుల  స్వేచ్ఛ కంటే  సాక్షుల భద్రత, నిష్పాక్షిక దర్యాప్తు ముఖ్యమని హైకోర్టు అభిప్రాయపడింది. 

Latest Videos

 వైఎస్ వివేకానందరెడ్డి హత్య  కేసులో నిందితుడిగా  ఉన్న సునీల్ యాదవ్  తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ  ఈ నెల  13వ తేదీన  పిటిషన్ దాఖలు చేశారు. ఈ బెయిల్ పిటిషన్ పై ఇవాళ  విచారణ నిర్వహించింది.  ఈ పిటిషన్ పై  వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి  సౌభాగ్యమ్మ  ఇంప్లీడ్  అయింది. ఈ మేరకు ఈ నెల  16న పిటిషన్ దాఖలు  చేసిన విషయం తెలిసిందే.  

ఈ కేసులో  సునీల్ యాదవ్  కీలక నిందితుడిగా  సీబీఐ పేర్కొంది.   ఈ సమయంలో   సునీల్ యాదవ్ కు బెయిల్ ఇవ్వవద్దని  కూడా  సీబీఐ  కోరింది.  మరో వైపు  సునీల్ యాదవ్ కు  బెయిల్ ఇవ్వాలని  పిటిషనర్ తరపు  న్యాయవాది వాదించారు. అయితే  సునీల్ యాదవ్ కు బెయిల్ ఇవ్వలేమని  తెలంగాణ హైకోర్టు తేల్చి చెప్పింది.

also read:ట్విస్ట్ : కీ రోల్ అతనిదే, సునీల్ యాదవ్‌కు బెయిల్ ఇవ్వొద్దు.. తెలంగాణ హైకోర్టులో వివేకా భార్య ఇంప్లీడ్ పిటిషన్

2019 మార్చి  19వ తేదీ రాత్రి పులివెందులలో  వైఎస్ వివేకానంరెడ్డిని దుండగులు హత్య  చేశారు. ఈ హత్య జరిగిన సమయంలో  చంద్రబాబునాయుడు సీఎంగా  ఉన్నారు.  చంద్రబాబు సర్కార్  సిట్ ను ఏర్పాటు చేసింది.  ఆ తర్వాత  అధికారంలోకి వచ్చిన జగన్ సర్కార్ కూడా సిట్ ను  ఏర్పాటు  చేసింది. ఈ కేసును  సీబీఐతో విచారణ చేయించాలని  వైఎస్ వివేకానందరెడ్డి కూతురు వైఎస్ వివేకానందరెడ్డి కూతురు వైఎస్  సునీతా రెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి,  మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డిలు  పిటిషన్లు దాఖలు చేశారు.  ఈ పిటిషన్లపై విచారణ  చేసిన  ఏపీ హైకోర్టు సీబీఐ విచారణకు  ఆదేశించింది.  
 

 


 

click me!