రేణిగుంట ఫాక్స్ లింక్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం: పరుగులు తీసిన కార్మికులు

Published : Feb 27, 2023, 03:41 PM ISTUpdated : Feb 27, 2023, 03:44 PM IST
రేణిగుంట ఫాక్స్ లింక్  ఫ్యాక్టరీలో  అగ్ని ప్రమాదం: పరుగులు తీసిన  కార్మికులు

సారాంశం

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని  రేణిగుంట ఫాక్స్ లింక్ ఫ్యాక్టరీలో  ఇవాళ అగ్ని ప్రమాదం  చోటు  చేసుకుంది.  

తిరుపతి:  ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని  రేణిగుంట  ఫాక్స్ లింక్ కంపెనీలో  సోమవారం నాడు అగ్ని ప్రమాదం  చోటు  చేసుకుంది. ఈ అగ్ని ప్రమాదంతో  ఫ్యాక్టరీలో  పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ఈ మంటలను చూసి భయంతో కార్మికులు  ఫ్యాక్టరీ నుండి బయటకు పరుగులు తీశారు.   ఫ్యాక్టరీలో  షార్ట్  సర్క్యూట్  కారణంగా  అగ్ని ప్రమాదం  చోటు  చేసుకుందని  సమాచారం.   అగ్ని ప్రమాదం  జరిగిన విషయం గుర్తించిన  ఫ్యాక్టరీ  సిబ్బంది  ఫైర్ ఫైటర్లకు  సమాచారం ఇచ్చారు.  హుటాహుటిన  ఫాక్స్  లింక్ ఫ్యాక్టరీ వద్దకు  ఫైరింజన్లు  చేరుకుని మంటలను ఆర్పుతున్నాయి. 

రేణిగుంట  విమానాశ్రయానికి సమీపంలో  ఈ ఫ్యాక్టరీ ఉంది.   మంటలు భారీగా  ఎగిసిపడుతున్నాయి. దీంతో  ఇతర ప్రాంతాల నుండి  కూడా  ఫైరింజన్లను రప్పించి  మంటలను ఆర్పివేసేందుకు  అధికారులు ప్రయత్నిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

YS Jagan: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రాష్ట్ర‌ప‌తి పాల‌న విధించాలి.. జ‌గ‌న్ డిమాండ్‌
కోటంరెడ్డి వ్యాఖ్యలపై జగన్ ఫస్ట్ రియాక్షన్ | YS Jagan On Kotamreddy Sridhar Reddy | Asianet Telugu