తిరుపతిలో సోము వీర్రాజును అడ్డగించిన ఆప్: ఉద్రిక్తత

Published : Feb 27, 2023, 02:45 PM ISTUpdated : Feb 27, 2023, 03:41 PM IST
 తిరుపతిలో  సోము వీర్రాజును  అడ్డగించిన ఆప్:  ఉద్రిక్తత

సారాంశం

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా   అరెస్ట్  ను నిరసిస్తూ  తిరుపతిలో  బీజేపీ  కార్యాలయం ముందు  ఆప్ శ్రేణులు  ఆందోళనకు దిగాయి.


తిరుపతి:  ఢిల్లీ డిప్యూటీ  సీఎం మనీష్  సిసోడియా అరెస్ట్  ను  నిరసిస్తూ  తిరుపతి  లో ఆప్ శ్రేణులు  నిరసనకు దిగారు.    బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు  కాన్వాయ్ ను  ఆప్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆప్  శ్రేణులను బీజేపీ  శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో  ఇరువర్గాల మధ్య  తోపులాట  చోటు  చేసుకుంది. దరిమిలా  ఉద్రిక్తత  నెలకొంది.  ఆప్,  బీజేపీ శ్రేణులు  ఘర్షణకు దిగాయి.   ఆప్ కార్యకర్తలు  బీజేపీ కార్యాలయం  ముందు  బైఠాయించి  నిరసనకు దిగారు. ఆందోళనకు దిగిన ఆప్ శ్రేణులను  బీజేపీ  శ్రేణులు  అక్కడి నుండి  తరిమివేశారు.   దీంతో  బీజేపీ కార్యాలయం వద్ద  కొద్దిసేపు ఉద్రిక్తత  చోటు  చేసుకుంది. 
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం