తెలంగాణలో ఎన్నికలు.. ఏపీలో సెలవు

Published : Nov 29, 2018, 03:42 PM IST
తెలంగాణలో ఎన్నికలు.. ఏపీలో సెలవు

సారాంశం

 దాదాపు తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, విద్యా సంస్థలన్నింటికీ ఆ రోజు సెలవు.

తెలంగాణలో వచ్చే నెల 7వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. దాదాపు తెలంగాణలో మీడియా మినహాయించి.. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, విద్యా సంస్థలన్నింటికీ ఆ రోజు సెలవు. ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకోవాలనే ఉద్దేశంతో.. ఎన్నికల రోజు సెలవు ప్రకటించారు.

అయితే.. ఆ రోజు కేవలం తెలంగాణలో మాత్రమే కాదు.. ఆంధ్రప్రదేశ్ లోనూ ఆ రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఏపీలోని ప్రభుత్వ ఉద్యోగులందరికీ డిసెంబర్ 7వ తేదీ సెలవుగా ప్రకటించింది. ఎందుకంటే..  ప్రభుత్వంలో వివిధ శాఖల్లో పనిచేస్తున్న పలువురు ఉద్యోగులకు ఇంకా తెలంగాణలో ఓటు హక్కు  ఉంది. అందుకే ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వారంతా తెలంగాణలో జరిగే పోలింగ్‌లో  పాల్గొనే వెసులుబాటు కల్పించింది. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?