అయేషా హత్య కేసులో కీలక నిర్ణయం: సీబీఐ దర్యాప్తుకు హైకోర్టు ఆదేశం

By Nagaraju TFirst Published Nov 29, 2018, 3:37 PM IST
Highlights

అయేషా మీరా హత్యకేసులో హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అయేషా హత్య కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్లు ఆదేశించింది. కొత్తగా ఎఫ్ఐ ఆర్ నమోదు చేసి కేసు దర్యాప్తు చేపట్టాలని సీబీఐకు రాష్ట్ర ధర్మాసనం ఆదేశించింది.
 

హైదరాబాద్: అయేషా మీరా హత్యకేసులో హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అయేషా హత్య కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్లు ఆదేశించింది. కొత్తగా ఎఫ్ఐ ఆర్ నమోదు చేసి కేసు దర్యాప్తు చేపట్టాలని సీబీఐకు రాష్ట్ర ధర్మాసనం ఆదేశించింది.

ఇప్పటికే అయేషా హత్య కేసులో ఏపీ ప్రభుత్వం సిట్ ను నియమించింది. అయితే హైకోర్టు తాజాగా కేసును సీబీఐకి అప్పగించింది. సిట్ విచారణ కూడా కొనసాగుతుందని తెలిపింది. విజయవాడ కోర్టులో ఫైల్ మిస్సింగ్ వ్యవహారంపై హైకోర్టు చాలా సీరియస్ అయ్యింది. 

అయేషా మీరా హత్య కేసులో దర్యాప్తు సరిగ్గా లేదంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసు దర్యాప్తు విషయంలో నిర్లిప్తత నెలకొందని మండిపడింది. అలాగే విజయవాడ కోర్టులో ఫైల్ మిస్సవ్వడంపై కూడా దర్యాప్తు చెయ్యాలని సీబీఐకు సూచించింది.   
 

click me!