టీడీపీ నేత సాదినేని యామినిపై అసభ్యకర పోస్టులు

Published : Nov 29, 2018, 03:24 PM IST
టీడీపీ నేత సాదినేని యామినిపై అసభ్యకర పోస్టులు

సారాంశం

సాదినేని యామిని ని కించపరిచేలా ఓ వ్యక్తి సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. 


టీడీపీ మహిళా నేత సాదినేని యామిని ని కించపరిచేలా ఓ వ్యక్తి సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. టీడీపీలో సాదినేని యామిని చాలా యాక్టివ్ గా ఉంటారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధులను వివరిస్తూనే.. ప్రతిపక్ష నేతలపై విమర్శలు చేయడంలో యామిని ముందుంటారు.

గత కొంతకాలంగా.. జనసేన అధినేత పవన్ విషయంలోనూ యామిని తీవ్రంగానే స్పందించారు. ఒక టీవీ లైవ్ షోలో యామినీ కి, జనసేన పార్టీ నేత ఒకిరికి తీవ్ర స్థాయిలో వాగ్వాదం కూడా జరిగింది. అయితే.. పవన్ ని విమర్శిస్తున్నారనే కోపంతో.. ఆమె ను కించపరిచేలా అసభ్యకరమైన పోస్టింగ్ లు పెట్టారు.

నెల్లూరుకు చెందిన గంగినేని శ్రావణ్ కుమార్ ని యామిని ని టార్గెట్ చేసి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశాడు. దీంతో.. ఆమె అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు అతనిని అరెస్టు చేశారు.

అయితే.. జనసేన పార్టీ నేతలే కావాలని తనపై ఇలాంటి కామెంట్స్ చేయిస్తున్నారని యామిని ఆరోపించారు. వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?