సన్నాసి వ్యాఖ్యలు: పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు మంత్రి వెల్లంపల్లి కౌంటర్

By telugu teamFirst Published Sep 26, 2021, 10:45 AM IST
Highlights

తమపై వ్యాఖ్యలు చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. చిరంజీవి లేకపోతే పవన్ కల్యాణ్ జీరో అని ఆయన అన్నారు. ప్రకాశ్ రాజ్ నటనలో పావలా వంతు కూడా పవన్ చేయలేదని ఆయన అన్నారు.

విజయవాడ: రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. పవన్ కల్యాణ్ మీద ఆంధ్రప్రదేశ్ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. తమను సన్నాసి అనడంపై పవన్ కల్యాణ్ కు ఆయన కౌంటర్ ఇచ్చారు. పవన్ కల్యాణ్ కన్నా సన్నాసి ఎవరూ ఉండరని ఆయన ఓ ప్రముఖ టీవీ చానెల్ ప్రతినిధితో అన్నారు. 

ఎవరు డబ్బులు ఇస్తే వారి డైలాగులు చెప్పే వ్యక్తి పవన్ కల్యాణ్ అని వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. చిరంజీవి లేకపోతే పవన్ కల్యాణ్ జీరో అని ఆయన వ్యాఖ్యానిచారు. పవన్ కల్యాణ్ తన రూ.2 కోట్ల రెమ్యునరేషన్ ఎందుకు తగ్గించుకోరని ఆయన అడిగారు ప్రభుత్వం సినిమా టికెట్లు అమ్మితే తప్పేమిటని ఆయన ప్రస్నించారు. చిరంజీవి, ఇతరులు చెప్పడం వల్లనే ప్రభుత్వం టికెట్లు అమ్మడానికి ముందుకు వచ్చిందని ఆయన చెప్పారు 

Also Read: సాయి ధరమ్ తేజ్ ప్రమాదం: మీడియాపై పవర్ పంచ్ లు, వైఎస్ జగన్ టార్గెట్

ముఖ్యమంత్రి జగన్ మీద, తమ మంత్రుల మీద పవన్ కల్యాణ్ ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని ఆయన హెచ్చిరించారు పవన్ కల్యాణ్ రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిస్పృహతో మాట్లాడారని ఆయన అన్నారు. విజయవాడ కార్పోరేషన్ లో జనసేనకు ఒక్క సీటు కూడా రాలేదని, పోటీ చేసిన రెండు చోట్ల పవన్ కల్యాణ్ ఓడిపోయారని మంత్రి అన్నారు,

పావలా కల్యాణ్ ను మంత్రులమే పట్టించుకోవడం లేదని, ఇక ముఖ్యమంత్రి జగన్ ఎందుకు పట్టించుకుంటారని ఆయన అన్నారు.  బ్లాక్ లో సినిమా టికెట్లు అమ్మించి సొమ్ము చేసుకునే వ్యక్తి పవన్ కల్యాణ్ అని ఆయన అన్నారు. ప్రజలను పీడించి డబ్బులు సంపాదించుకునే వ్యక్తి పవన్ కల్యాణ్ అని ఆయన అన్నారు. సినిమా పేరు చెప్పుకుని బతికే వ్యక్తి పవన్ కల్యాణ్ అన్నారు. రెమ్యునరేషన్ తగ్గించుకోని పవన్ కల్యాణ్ ప్రజలకు సేవ చేస్తారా అని ఆడిగారు.

Also Read: స్టార్‌ హీరోల భారీ రెమ్యూనరేషన్‌.. అసలు లెక్కలు చెప్పిన పవన్ కళ్యాణ్‌‌.. ప్రభాస్‌, ఎన్టీఆర్, చరణ్‌ల ప్రస్తావన

తాను వకీల్ సాబ్ సినిమా చూశానని, ప్రకాశ్ రాజ్ చేసిన నటనలో పావలా వంతు కూడా పవన్ కల్యాణ్ చేయలేదని ఆయన విమర్సించారు. పవన్ కల్యాణ్ వల్ల పలువురు నిర్మాతలు నాశమయ్యారని, పవన్ కల్యాణ్ సినిమాలకు డబ్బులు రాక నష్టాల్లో కూరుకుపోయారని ఆయన అన్నారు.

ప్రభుత్వం టికెట్లు విక్రయిస్తే పవన్ కల్యాణ్ వంటి దోచుకునేవాళ్లకే ఇబ్బంది అని, మిగతావాళ్లకు ఏ విధమైన ఇబ్బంది లేదని ఆయన అన్నారు. లేస్తే మనిషిని కాదని పవన్ కల్యాణ్ అంటారని, ఎన్నిసార్లు లేస్తాడని ఆయన అన్నారు. 

click me!