సురేష్‌ రెడ్డిది వన్ సైడ్ లవ్: తాటిపర్తి ఘటనపై ఎస్పీ విజయరావు

Published : May 09, 2022, 06:33 PM ISTUpdated : May 09, 2022, 10:37 PM IST
 సురేష్‌ రెడ్డిది వన్ సైడ్ లవ్: తాటిపర్తి ఘటనపై ఎస్పీ విజయరావు

సారాంశం

నెల్లూరు జిల్లా తాటిపర్తిలో కావ్యను హత్య చేసి సురేష్ రెడ్డి  ఘటనపై ఎస్పీ విజయరావు స్పందించారు. సురేష్ రెడ్డికి తుపాకీ ఎక్కడి నుండి వచ్చిందనే విషయమై పోలీసుల  ఆరా తీస్తున్నారు.

నెల్లూరు: టెక్కీ సురేష్ రెడ్డికి తుపాకీ ఎక్కడి నుండి వచ్చిందనే విషయమై తెలియాల్సి ఉందని నెల్లూరు జిల్లా ఎస్సీ విజయరావు చెప్పారు.సోమవారం నాడు సాయంత్రం కావ్యరెడ్డిపై కాల్పులు జరిపి మాలపాటి సురేష్ రెడ్డి ఆత్మహత్య చేసుకొన్న ఘటనపై నెల్లూరు జిల్లా ఎస్పీ Vijayaa Rao   తాటిపర్తిలో మీడియాతో మాట్లాడారు.Malapati Suresh Reddy  ఉపయోగించిన తుపాకీపై మేడిన్ యూఎస్ఏ అని రాసి ఉందన్నారు. అయితే ఈ తుపాకీ ఇక్కడే తయారు చేసి ఉండవచ్చని ఎస్పీ అనుమానం వ్యక్తం చేశారు.

ఇవాళ మధ్యాహ్నం కావ్య రెడ్డి ఇంటికి వెళ్లిన సురేష్ ఆమెను దారుణంగా హత్య చేశాడు. కావ్యను పెళ్లి చేసుకోవాలని సురేష్ రెడ్డి భావించాడు. ఈ విషయమై కావ్య కుటుంబ సభ్యుతో చర్చించాడు.అయితే సురేష్ రెడ్డితో పెళ్ళికి కావ్య నిరాకరించింది. దీంతో కక్ష పెంచుకొన్న సురేష్ రెడ్డి ఇవాళ కావ్య ఇంటికి వెళ్లి తుపాకీతో కాల్చి చంపాడు. ఆ తర్వాత తాను కూడా తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. కావ్య పెళ్లికి ఒప్పుకోని కారణంగానే నిందితుడు ఈ దారుణానికి పాల్పడినట్టుగా ఎస్పీ విజయరావు చెప్పారు.

సురేష్ రెడ్డికి  Pistol  ఎక్కడి నుండి వచ్చిందో తెలియదన్నారు.సురేష్ ది వన్ సైడ్ లవ్ అని ఎస్పీ వివరించారు.గత నెలలో పెళ్లి ప్రపోజల్ పెట్టారని ఎస్పీ తెలిపారు.కావ్యకు మేసేజ్ లు, ఫోన్లు చేసేవారని తమ దర్యాప్తులో తేలిందని ఎస్పీ చెప్పారు. Kavya కు మాత్రం సురేష్ రెడ్డితో పెళ్లి ఇష్టం లేదని ఎస్పీ వివరించారు. మొదటి బుల్లెట్ నుండి కావ్య తప్పించుకుందన్నారు. రెండో బుల్లెట్ కావ్య తలలో దిగిందని ఎస్పీ వివరించారు. ఈ దాడిని అడ్డుకున్న కావ్య చెల్లెల్ని సురేష్ రెడ్డి పక్కకు నెట్టివేశారని ఎస్పీ చెప్పారు. కావ్య హత్యపై కుటుంబ సభ్యులు ఇచ్చిన పిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ వివరించారు. సురేష్ రెడ్డి హత్య చేసిన సమయంలో మద్యం తాగి ఉన్నాడా లేదా అనే విషయమై కూడా దర్యాప్తు చేస్తున్నారు.

సురేష్ రెడ్డి, కావ్యలు గతంలో చెన్నైలో సాప్ట్ వేర్ ఇంజనీర్లుగా పనిచేసేవారు. రెండేళ్లుగా వర్క్ ఫ్రమ్ హోం లో భాగంగా వీరిద్దరూ స్వంత ఊళ్లలోనే ఉంటూ విధులు నిర్వహిస్తున్నారు.సురేష్ రెడ్డి, కావ్యలు ఒకే గ్రామానికి చెందినవారు. సురేష్ రెడ్డి దుందుడుకు స్వభావం ఉన్న వ్యక్తిత్వం కలవాడని ఆయన గురించి తెలిసిన వారు చెబుతున్నారు.

 ఈ విషయమై పోలీసులకు గ్రామస్థులు సమాచారం అందించారు.ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.  ఈఘటన గ్రామంలో ఉద్రిక్తతకు కారణమైంది., గ్రామానికి భారీగా పోలీసులను తరలిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.

సురేష్ రెడ్డి పైకో : కావ్య బంధువు

సురేష్ రెడ్డి ఓ సైకో అని కావ్య బంధువు ఒకరు చెప్పారు. సురేష్ రెడ్డి గురించి అతని సన్నిహితులు  చెబుతున్నారన్నారు. కావ్య పెళ్లికి ఒప్పుకోలేదని కక్సతో సురేష్ రెేడ్డి ఈ దారుణానికి పాల్పడ్డాడని చెప్పారు. సురేష్ రెడ్డి గురించి తమకు ఇంతకు ముందు ఈ విషయాలు తెలియవని చెప్పారు.

 

PREV
click me!

Recommended Stories

Minister Gottipati Ravi Kumar: జయహో లోకేష్.. ఆయన వల్లే కోటి మంది పసుపు సైన్యం| Asianet News Telugu
Food Commission Motivation:చదువు అనే ఆయుధంతో పేదరికానికి పులిస్టాప్ పెట్టొచ్చు | Asianet News Telugu