వంద మందొచ్చినా జగన్ వెంట్రుక కూడా పీకలేరు: విపక్షాల పొత్తులపై ఎంపీ నందిగం

By narsimha lode  |  First Published May 9, 2022, 6:02 PM IST


టీడీపీ చీఫ్ చంద్రబాబుపై బాపట్ల ఎంపీ నందిగం సురేష్ విమర్శలు చేశారు. విపక్షాల మధ్య కూటమి ఏర్పాటుపై ఆయన స్పందించారు. 
 


గుంటూరు: వందమంది కలిసి వచ్చినా కూడా YS Jagan వెంట్రుక కూడా పీకలేరని బాపట్ల ఎంపీ నందిగం సురేష్ ధీమాను వ్యక్తం చేశారు.సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు.దత్తపుత్రుడితో కలిసి Chandrababu కుయుక్తులు పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. ఇంటింటికి తిరిగి  అందరిని కలిసి రావాలని అడుక్కుతింటున్నారని చంద్రబాబుపై ఆయన విమర్శలు చేశారు.Andhra Pradesh రాష్ట్రంలో విపక్షాల మధ్య పొత్తులకు ఆయా పార్టీలు సంకేతాలు ఇచ్చాయి.  ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు గాను విపక్షాల మధ్య పొత్తు ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ పొత్తుల ప్రకటనలపై YCP తీవ్రంగా మండిపడుతుంది.

Jana Sena  ఆవిర్భావ దినోత్సవ వేడుకల సమయంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా తాను ప్రయత్నిస్తానని జనసేన చీఫ్ Pawan Kalyan  ప్రకటించారు. గత వారంలో తూర్పు గోదావరి  జిల్లా పార్టీ కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. విపక్షాలు ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. విపక్షాలకు TDP  నాయకత్వం వహిస్తుందని చెప్పారు.  అవసరమైతే మెట్టు దిగుతానని, త్యాగానికి కూడా సిద్దమని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ వ్యాఖ్యలపై నిన్న పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో అద్భుతం జరుగుతుందన్నారు. పొత్తుల విషయమై చంద్రబాబు నేరుగా మాట్లాడితే తాను స్పందిస్తానని ప్రకటించారు. అదే సమయంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఉండేందుకు గాను విశాల ప్రయోజనాల దృష్ట్యా విపక్షాల మధ్య ఐక్యత ఉండాల్సిన అవసరం ఉందని కూడా ఆయన అభిప్రాయపడ్డారు.

Latest Videos

click me!