ప్రకాశంలో టెక్కీ రాధ అనుమానాస్పద మృతి: పోలీసుల దర్యాప్తు

By narsimha lode  |  First Published May 18, 2023, 11:01 AM IST

ప్రకాశం  జిల్లాలో  సాఫ్ట్ వేర్  ఉద్యోగి  రాధ  అనుమానాస్పద స్థితిలో మరణించింది. 


ఒంగోలు:  ప్రకాశం  జిల్లా  వెలిగండ్ల  మండలం  జిల్లెళ్లపాడులో  గురువారంనాడు సాఫ్ట్ వేర్  ఉద్యోగి రాధ  అనుమానాస్పదస్థితిలో  మృతి చెందింది.  రెండు  రోజులుగా  ఆమె  కన్పించడం లేదని  పోలీసులకు  పేరేంట్స్  ఫిర్యాదు  చేశారు.  ఈ ఫిర్యాదు మేరకు  పోలీసులు  రాధ  కోసం   గాలింపు చర్యలు చేపట్టారు. అయితే  ఇవాళ  రాధ  డెడ్ బాడీని  జిల్లెళ్లపాడు వద్ద  పోలీసులు గుర్తించారు. రాధ మృతిపై  పోలీసులు  దర్యాప్తు  చేస్తున్నారు.  రాధను హత్య  చేశారని  పోలీసులు అనుమానం వ్యక్తం  చేస్తున్నారు.  ఆర్ధిక లావాదేవీల విషయమై  రాధ  హత్య జరిగిందనే అనుమానాలు  కూడా వ్యక్తమౌతున్నాయి.  ఈ దిశగా  కూడా  పోలీసులు దర్యాప్తు  సాగిస్తున్నారు

tags
click me!