కుడి భుజం నొప్పితో లోకేష్: నంద్యాలలో ఎంఆర్ఐ స్కానింగ్

By narsimha lode  |  First Published May 18, 2023, 9:42 AM IST

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్  కుడి భుజం నొప్పితో బాధపడుతున్నారు. నంద్యాలలోని  ప్రైవేట్ ఆసుపత్రిలో  లోకేష్  ఎంఆర్ఐ స్కానింగ్  చేశారు  వైద్యులు.



కర్నూల్: టీడీపీ  జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్  కుడి భుజంనొప్పితో బాధపడుతున్నారు.  గురువారంనాడు  నంద్యాలలోని  ప్రైవేట్ ఆసుపత్రిలో  లోకేష్   కుడి భుజానికి  వైద్యులు  ఎంఆర్ఐ స్కానింగ్  చేశారు.   ఈ స్కానింగ్  నివేదిక ప్రకారంగా  లోకేష్ భుజానికి  వైద్యులు  చికిత్స అందించనున్నారు. 

యువగళం  పేరుతో  లోకేష్  ఈ ఏడాది జనవరి   27న   పాదయాత్రను  కుప్పంలో  ప్రారంభించారు.   ఉమ్మడి అనంతపురం  జిల్లాలో  కార్యకర్తల  తోపులాటతో  లోకేష్ భుజానికి గాయమైంది.  అప్పటి నుండి  ఆయన  భుజం  నొప్పితో బాధపడుతున్నారు. వైద్యుల సూచనల మేరకు  లోకేష్  కుడి భుజం నొప్పికి  మందులు వాడుతున్నారు.  అయితే  ఇవాళ  నొప్పి  మరింత  ఎక్కువైంది.  దీంతో  నంద్యాలలోని  ప్రైవేట్  ఆసుపత్రిలో  లోకేష్  ఎంఆర్ఐ స్కానింగ్  చేయించుకున్నారు. ఎంఆర్ఐ  స్కానింగ్  నివేదిక  ప్రకారంగా  వైద్యులు  చికిత్స అందించనున్నారు.

Latest Videos

undefined

 రాష్ట్ర వ్యాప్తంగా  400  రోజుల పాటు  4 వేల కిలోమీటర్ల పాటు పాదయాత్ర  నిర్వహించాలని   లోకేష్ తలపెట్టారు .  ఈ మేరకు  కుప్పం నుండి  లోకేష్ పాదయాత్ర  సాగుతుంది.  రాష్ట్రంలో  ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను  తెలుసుకొని  వాటి పరిష్కారం కోసం  తమ పార్టీ ఏం చేయనుందో  ఎన్నికల మేనిఫెస్టో లో టీడీపీ పొందుపర్చనుంది.

2014  అసెంబ్లీ ఎన్నికలకు  ముందు  చంద్రబాబునాయుడు  ఉమ్మడి  ఏపీ రాష్ట్రంలో  పాదయాత్ర నిర్వహించారు.  ఈ పాదయాత్ర  తర్వాత  జరిగిన  ఎన్నికల్లో   ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  టీడీపీ అధికారాన్ని  కైవసం  చేసుకుంది.  చంద్రబాబునాయుడు ఏపీ సీఎంగా  ఉన్న సమయంలో  వైఎస్ జగన్  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  పాదయాత్ర  నిర్వమించారు.  2019  ఎన్నికల్లో  వైఎస్ జగన్ నేతృత్వంలోని  వైఎస్ఆర్‌సీపీ  అధికారంలోకి వచ్చింది.  ప్రస్తుతం  నారా లోకేష్  పాదయాత్రను నిర్వహిస్తున్నారు.

click me!