టెక్కీ మనోజ్ఞ, ఆమె కూతురు తులసి మృతి: పోస్టుమార్టం రిపోర్టులో షాకింగ్ అంశాలు

By narsimha lodeFirst Published Sep 2, 2020, 12:10 PM IST
Highlights

టెక్కీ మనోజ్ఞ, ఆమె కూతురు తులసి అనుమానాస్పద మృతిపై పోస్టుమార్టం రిపోర్టులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. 36 నుండి 48 గంటల ముందే మనోజ్ఞ, ఆమె కూతురు తులసిలు చనిపోయారని పోస్టుమార్టం రిపోర్టు ప్రాథమిక నివేదిక తెలుపుతోంది.


అమరావతి: టెక్కీ మనోజ్ఞ, ఆమె కూతురు తులసి అనుమానాస్పద మృతిపై పోస్టుమార్టం రిపోర్టులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. 36 నుండి 48 గంటల ముందే మనోజ్ఞ, ఆమె కూతురు తులసిలు చనిపోయారని పోస్టుమార్టం రిపోర్టు ప్రాథమిక నివేదిక తెలుపుతోంది.

గత నెల 29వ తేదీన అపార్ట్ మెంట్ పై నుండి దూకి మనోజ్ఞ, ఆమె కూతురు తులసి మరణించినట్టుగా భర్త కళ్యాణ్ చెబుతున్నారు. అయితే ఈ విషయంలో అత్తింటి వేధింపులే కారణమని మనోజ్ఞ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు మేరకు కళ్యాణ్ తో పాటు  ఆయన తల్లిదండ్రులపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

మనోజ్ఞ మృతదేహానికి పరీక్షలు చేసిన సమయంలో ఆమెకు కరోనా ఉన్నట్టుగా తేలింది. దీంతో  కళ్యాణ్ తో పాటు అతని తల్లిదండ్రులను ఇంట్లోనే బైండోవర్ చేస్తున్నట్టుగా ఆగష్టు 30వ తేదీన గుంటూరు అర్బన్ ఎస్పీ తెలిపారు. 

also read:టెక్కీ మనోజ్ఞమృతి కేసు: పోలీసుల అదుపులో భర్త, అతని పేరేంట్స్

టెక్కీ పోస్టుమార్టం నివేదిక ప్రకారంగా షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. 36 నుండి 48 గంటల ముందు వీరు చనిపోయినట్టుగా ఈ నివేదిక తెలుపుతోంది.  కూతురును చంపి మనోజ్ఞ ఆత్మహత్య చేసుకొందా.... లేక హత్య జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే తన కూతురిని అత్తింటి వాళ్లే చంపారని టెక్కీ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.ఈ ఆరోపణలను కళ్యాణ్ ఖండించారు. కళ్యాణ్ కాల్ డేటాను పరిశీలిస్తే అసలు విషయాలు వెలుగు చూస్తాయని వారు చెబుతున్నారు.

click me!