డీజే వివాదం : కామేపల్లిలో తేదేపా కార్యకర్త హత్య..

By AN TeluguFirst Published Jun 25, 2021, 10:27 AM IST
Highlights

చిన్న వివాదాన్ని అడ్డం పెట్టుకుని ప్రత్యర్థి వర్గం చేసిన దాడిలో తెదేపా కార్యకర్త ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం కామేపల్లి ఎస్సీ కాలనీలో ఈ ఘటన  చోటు చేసుకుంది. కామేపల్లిలో ఈ నెల 21న తేదేపాకు చెందిన లక్కెపోగు ఏసుదాసు కుటుంబంలో వివాహ వేడుక జరిగింది. 

ఈ సందర్భంగా డీజే పాటలు ఏర్పాటు చేసుకున్నారు. డీజే పెట్టడం మీద వైకాపా కార్యకర్త లక్కెపోగు కోటేశ్వరరావు వర్గానికి చెందినవారు పోలీసులకు తెలిపారు. పోలీసులు వచ్చి పాటలు బంద్ చేయించి, పరికరాలు తీసుకెళ్లారు. 

అప్పటినుంచి రెండు వర్గాల మధ్య వాదోపవాదాలు చోటు చేసుకన్నాయి. ఈ క్రమంలో బుదవారం రాత్రి రెండు వర్గాల వారు ఘర్షణకు దిగారు. ఇనుప రాడ్లు, రాళ్లు, మారణాయుధాలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఏసుదాసు వర్గానికి చెందిన అయిదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. 

ఇందులో తేదేపా కార్యకర్త లక్కెపోగు సుబ్బారావు (42) చికిత్స పొందుతూ మృతి చెందారు. కోటేశ్వరరావు వర్గానికి చెందిన నలుగురు గాయపడ్డారు. రెండు వర్గాల ఫిర్యాదుల మేరకు 29 మందిమీద కేసులు నమోదు చేసినట్లు అద్దంకి సీఐ రాజేష్ తెలిపారు.

ఘటనలో రాజకీయ కోణం లేదని డీఎస్పీ కె. ప్రకాశరావు వెల్లడించారు. గ్రామంలో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు పికెట్ ఏర్పాటు చేసినట్లు గురువారం తెలిపారు. వైకాపా వారు తేదేపా కార్యకర్తలమీద దాడులకు పాల్పడి హత్యలు చేయడం హేయమని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ అన్నారు. కామేపల్లికి చెందిన తేదేపా కార్యకర్త సుబ్బారావు హత్యోదంతాన్ని ఖండించారు. నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న పార్టీ కార్యకర్తలను పరామర్శించారు. 

click me!