పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డ రెండున్నర కోట్ల బంగారం (వీడియో)

Arun Kumar P   | Asianet News
Published : Jun 25, 2021, 09:22 AM ISTUpdated : Jun 25, 2021, 09:27 AM IST
పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డ రెండున్నర కోట్ల బంగారం (వీడియో)

సారాంశం

ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును తనిఖీ చేసిన  కర్నూల్ పోలీసులకు ఓ ప్రయాణికుడి వద్ద 5 కేజీల 85 గ్రాముల బంగారం దొరికింది. 

కర్నూలు: హైదరాబాద్ నుండి బెంగళూరుకు అక్రమంగా తరలిస్తున్న రెండున్నర కోట్ల విలువైన బంగారం కర్నూల్ పోలీసుల తనిఖీల్లో బయటపడింది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును తనిఖీ చేసిన పోలీసులకు ఓ ప్రయాణికుడి వద్ద 5 కేజీల 85 గ్రాముల బంగారం దొరికింది. ఈ బంగారానికి సంబంధించిన సరైన పత్రాలు లేకపోవడంతో పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. 

కర్నూల్ జిల్లా ఎస్పీ పక్కీరప్ప, అడిషనల్ ఎస్పీ గౌతమి సాలి ఆదేశాల మేరకు రాష్ట్ర సరిహద్దుల్లోని పంచలింగాల చెక్ పోస్టు వద్ద గురువారం తెల్లవారుజూమున పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే హైదరాబాదు నుండి బెంగళూరు వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఆపి తనిఖీ చేశారు. దీంతో బెంగళూరుకు చెందిన నగల వ్యాపారి మహావీర్ జైన్ (అరిహంత్ జ్యువెలరీ షాప్ , శివాజీ నగర్ నార్త్ బెంగళూరు) వద్ద గల బ్యాగును తెరిచిచూడగా సుమారు 5 కేజీల 85 గ్రాముల (45 బంగారు బిస్కెట్లు, రెండు నెక్లెస్ లు) బంగారాన్ని గుర్తించారు.

వీడియో

ఈ బంగారానికి సంబంధించి సరైన పత్రాలు, ఎలాంటి ఆధారాలు, బిల్లులు లేకపోవడంతో వాటిని స్వాదీనం చేసుకుని కర్నూల్ తాలూకా పోలీస్ స్టేషన్ కు తరలించారు. సరైన పత్రాలతో వస్తే వీటిని తిరిగి అప్పగిస్తామని పోలీసులు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?