ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు: మంత్రి ఆదిమూలపు సురేష్

By narsimha lode  |  First Published Jun 24, 2021, 7:26 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్  టెన్త్ పరీక్షలు రద్దు చేస్తున్నట్టుగా ఏపీ  రాష్ట్ర  విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు.
 


అమరావతి:  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్  టెన్త్ పరీక్షలు రద్దు చేస్తున్నట్టుగా ఏపీ  రాష్ట్ర  విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు.ఇంటర్ పరీక్షలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగిందన్నారు. పరీక్షలు నిర్వహించిన తర్వాత ఫలితాలు ప్రకటించడానికి 40 రోజుల  సమయం పడుతుందని మంత్రి తెలిపారు.  

సుప్రీం ఆదేశాల మేరకు ఈ ఏడాది జూలై 31 వ తేదీ లోపుగా పరీక్షలు నిర్వహించి ఫలితాలు ప్రకటించడం సాధ్యం కాదన్నారు.ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకొచ్చామన్నారు. ఈ నేపథ్యంలో టెన్త్, ఇంటర్ పరీక్షలను రద్దు చేయాలని  నిర్ణయం తీసుకొన్నామని  మంత్రి తెలిపారు.ఫలితాల  కోసం హైపవర్ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ఇతర బోర్డులు పరీక్షలు రద్దు చేయడం వల్ల ఏపీ రాష్ట్ర విద్యార్థులకు ఎలాంటి నష్టం జరగదని ఆయన వివరించారు. 

Latest Videos

రాష్ట్రంలో కరోనా కారణంగా పరీక్షలను నిర్వహించకుండా ప్రభుత్వం వాయిదా వేసింది.  పరీక్షల నిర్వహణకే ప్రభుత్వం మొగ్గుచూపింది. అయితే ఈ విషయమై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ పై ఏపీ ప్రభుత్వం ఇవాళ అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ అఫిడవిట్ పై కూడ సుప్రీంకోర్టుత అనే ప్రశ్నలు లేవనెత్తింది. ఒక్క విద్యార్థి మరణించినా కూడ కోటి రూపాయాలు చెల్లించాల్సిన పరిస్థితులు ఉన్నాయని ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. 

సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో ఇవాళ సాయంత్రం  సీఎంతో చర్చించిన తర్వాత మంత్రి సురేష్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించారు. రాష్ట్రంలో టెన్త్, ఇంటర్ పరీక్షలను రద్దు చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కానీ, కానీ, ప్రభుత్వం మాత్రం విద్యార్థుల భవిష్యత్తు కోసమే పరీక్షలు నిర్వహిస్తామని తేల్చి చెప్పింది.

click me!