మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు: ఏపీ అసెంబ్లీ నుండి టీడీపీ ఎమ్మెల్యేల వాకౌట్

By narsimha lodeFirst Published Dec 2, 2020, 10:30 AM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుండి బుధవారం నాడు టీడీపీ సభ్యులు వాకౌట్ చేశారు. సభలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ఆరోపిస్తూ టీడీపీ ఎమ్మెల్యేలు సభ నుండి వాకౌట్ చేశారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుండి బుధవారం నాడు టీడీపీ సభ్యులు వాకౌట్ చేశారు. సభలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ఆరోపిస్తూ టీడీపీ ఎమ్మెల్యేలు సభ నుండి వాకౌట్ చేశారు.విద్యుత్ సవరణ బిల్లు, అసైన్డ్ భూముల చర్చలో పాల్గొనే అవకాశం ఇవ్వడం లేదని టీడీపీ ఆరోపించింది.

also read:ఏపీ అసెంబ్లీ: చంద్రబాబు మినహా 15 మంది టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్

గత రెండు రోజుల్లో సభ నుండి టీడీపీ సభ్యులను సభ నుండి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఏపీ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజున చంద్రబాబు సహా 16 మంది టీడీపీ ఎమ్మెల్యేలను సభ నుండి సస్పెండ్ చేశారు.

 

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుండి బుధవారం నాడు టీడీపీ సభ్యులు వాకౌట్ చేశారు. సభలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ఆరోపిస్తూ టీడీపీ ఎమ్మెల్యేలు సభ నుండి వాకౌట్ చేశారు. pic.twitter.com/M1OxaWo84a

— Asianetnews Telugu (@AsianetNewsTL)

ఈ నెల 1వ తేదీన చంద్రబాబు  మినహా 16 మంది ఎమ్మెల్యేలను సభ నుండి సస్పెండ్ చేశారు. ఇవాళ జరిగిన చర్చలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ఆరోపిస్తూ టీడీపీ సభ్యులు సభ నుండి వాకౌట్ చేశారు.

ఇసుక కొరత విషయమై అసెంబ్లీ సమావేశాలకు ముందే టీడీపీ ప్రజా ప్రతినిధులు అసెంబ్లీ  ముందు నిరసనకు దిగారు. ప్రభుత్వమే ఇసుక కొరతను సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది.


 

click me!