తాడిపత్రి మున్సిపల్ కార్యాలయంలో రగడ.. చైర్మన్ పోడియం ముట్టడించిన వైసీపీ కౌన్సిలర్లు..

Published : Aug 28, 2023, 12:11 PM IST
 తాడిపత్రి మున్సిపల్ కార్యాలయంలో రగడ.. చైర్మన్ పోడియం ముట్టడించిన వైసీపీ కౌన్సిలర్లు..

సారాంశం

తాడిపత్రి మున్సిపల్ కార్యాలయంలో రసాభాస చోటుచేసుకుంది. టీడీపీ, వైసీపీ కౌన్సిలర్లు ఘర్షణకు దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

తాడిపత్రి మున్సిపల్ కార్యాలయంలో రసాభాస చోటుచేసుకుంది. టీడీపీ, వైసీపీ కౌన్సిలర్లు ఘర్షణకు దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వివరాలు.. టీడీపీకి చెందిన కౌన్సిలర్ రాబర్ట్.. ఇటీవల వైసీపీ గూటికి చేరారు. అయితే మున్సిపల్ స్థలాన్ని అక్రమించారని టీడీపీ కౌన్సిలర్లు ఆరోపించారు. ఈ క్రమంలోనే రాబర్ట్‌ను మూడు మీటింగ్‌లకు సస్పెండ్ చేయాలని టీడీపీ ప్రతిపాదించింది. ఇందుకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. అయితే దీనిని రాబర్ట్‌తో పాటు వైసీపీ కౌన్సిలర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. 

ఈ క్రమంలోనే వైసీపీ  కౌన్సిలర్లు మున్సిపల్ చైర్మన్ పోడియాన్ని ముట్టడించారు. దీంతో వైసీపీ కౌన్సిలర్ల తీరుపై మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు