వివాహేతర సంబంధం : కడపలో జంట ఆత్మహత్యాయత్నం.. కశ్మీర్ నుంచి ఫోన్..

Published : Mar 31, 2021, 01:31 PM IST
వివాహేతర సంబంధం : కడపలో  జంట ఆత్మహత్యాయత్నం.. కశ్మీర్ నుంచి ఫోన్..

సారాంశం

అనంతపురం జిల్లా ఓబుళదేవరచెరువు మండలానికి చెందిన ఇద్దరు ఇటీవల కొన్ని రోజుల క్రితం కడపకు వచ్చారు. మంగళవారం వారు రిమ్స్ పోలీస్ స్టేషన్ పరిసరాల్లో పరస్పరం ఆత్మహత్యాయత్నానికి పాల్పడేందుకు ప్రయత్నించారు. వారి బంధువు, సైనికుడు కశ్మీర్ నుంచి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. 

దీంతో రిమ్స్ సీఐ పి. సత్యబాబు, తమ సిబ్బందితో పాటు, బ్లూ కోల్డ్స్ సకాలంలో ఘటనా స్థలానికి వెళ్లి ఆత్మహత్యాయత్నంను భగ్నం చేసి ప్రాణాలను రక్షించారు. సీఐ తెలిపిన కథనం మేరకు.. అనంతపురం జిల్ల ఓడీసికి చెందిన ఖాజాపీర్ కు భార్య, పిల్లలు ఉన్నారు. ఖాజాపీర్ కు అదే ప్రాంతానికి చెందిన నఫ్రీన్ తో పరిచయం ఏర్పడింది. క్రమంగా వీరి బంధం ప్రేమగా మారింది. 

ఖాజాపీర్, నఫ్రీన్ కడపకు కొన్ని రోజుల క్రితం పరారైవచ్చారు. ఓడీసీలో యువతి అదృశ్యం కేసు నమోదైంది. తమ పెద్దల వద్ద అవమానంగా భావించి, వివాహం చేసుకున్నా బంధువులు వదిలి పెట్టారని పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడాలని నిర్ణయించుకున్నరు. అదే తడవుగా, రిమ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నగర శివార్లలో పురుగుల మందు చేతపట్టుకుని తమ బంధువైన సైనికుడితో ఫోన్ లో మాట్లాడారు. 

అతను నేరుగా రిమ్స్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సెల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా వారి దగ్గరకు కొన్ని నిమిషాల్లోనే చేరుకున్నారు. అంతలోపే యువకుడు పురుగుల మందు తాగాడు. యువతి కూడా పురుగుల మందు తాగుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఇద్దరినీ రిమ్స్ లో వైద్య సేవల కోసం చేర్పించారు. ఇద్దరి కుటుంబ సభ్యులు, బంధువులకు సమాచారం ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.  

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!