తమ నాయకుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ కు నిరసనగా గన్నవరంలో ఓ టిడిపి కార్యకర్త వినూత్న నిరసన తెలిపాడు.
గన్నవరం : ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో వున్నారు. దీంతో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. టిడిపి నాయకులు, కార్యకర్తలు చంద్రబాబును కక్షసాధింపు కోసమే సీఎం జగన్ అరెస్ట్ చేయించారని అంటుంటే... వైసిపి శ్రేణులు మాత్రం తప్పుచేసాడు కాబట్టే అరెస్ట్ చేసారంటున్నారు. ఇలా చంద్రబాబు అరెస్ట్ పై వివాదం కొనసాగుతున్నవేళ గన్నవరంలో టిడిపి నాయకులు వినూత్న నిరసన తెలిపారు.
వీడియో
చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా టిడిపి శ్రేణుల రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఇలా గన్నవరంలో కూడా యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ దీక్షాశిబిరం వద్ద ఓ టిడిపి కార్యకర్తలు అరగుండు కొట్టించుకుని నిరసన తెలిపాడు. వెంటనే చంద్రబాబును విడుదల చేయాలని కోరుకుంటూ ఇలా అరగుండుతో నిరసన తెలుపుతున్నట్లు సదరు టిడిపి నేత తెలిపాడు.